తిరుపతి ఉప ఎన్నికతో చాలా పిట్టలు రాలుతాయి.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 5 లక్షల మెజార్టీ ముచ్చట తీరుతుందా? ప్రతిపక్ష టీడీపీ తన రెండో ప్లేసును కాపాడుకుంటుందా? అన్నింటికంటే మిన్నగా బీజేపీ-జనసేన కూటమి ప్రతిపక్ష టీడీపీని తోసిరాజని రెండో స్థానంలోకి చేరుకుంటుందా? లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలకు తిరుపతి ఉప ఎన్నిక సమాధానం ఇవ్వనుంది. ఓ రకంగా ఆ కూటమి భవిష్యత్ తేల్చనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ కూటమి భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. తిరుపతి ఉపఎన్నిక ఫలితం ఏపీ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఇక్కడ చూపే సామర్థ్యాన్ని బట్టి ఏపీలో జనసేన-బీజేపీ పొత్తు భవిష్యత్ లో సాగుతుందా? లేదా అన్నది నిర్ణయిస్తుందని వారు అంటున్నారు.
బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటి రెండో స్థానం సాధిస్తే జనసేనతో కూటమి పొత్తు అలాగే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు కొనసాగింవచ్చంటున్నారు. ఇప్పటికే పవన్ చేసిన ప్రచారం బలిజ ఓటర్లను ప్రభావితం చేసింది. అలాంటప్పుడు బీజేపీ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌కు ప్రాముఖ్యత ఇస్తుంది. ఇప్పటికే పవన్ ను తదుపరి సీఎం అభ్యర్థిగా కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.
కానీ, ఉప ఎన్నికలో బీజేపీ కను మూడో స్థానానికి పడిపోయినా.. డిపాజిట్ దక్కకపోయినే వీరి పొత్తు ప్రమాదంలో పడే చాన్స్ ఉందంటున్నారు.బీజేపీ ఒక్కడ తన ఉనికి చాటుకోకపోతే జనసేనతో బంధం ముగిసిపోవడం ఖాయమంటున్నారు. పవన్ కళ్యాణ్ బిజెపి, నరేంద్ర మోడీ ఇద్దరినీ విమర్శిస్తూ ప్రకటనలు చేయవచ్చని అంటున్నారు.. అదే జరిగితే బీజేపీ కూడా పవన్ ను దూరం పెట్టే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ఈ ఎన్నికల ఫలితం వాస్తవానికి బిజెపి-జనసేన కూటమి భవిష్యత్ రాజకీయాలను నిర్ధేశిస్తుందని అంటున్నారు.
ప్రస్తుతానికి బీజేపీ -జనసేన కు పడిన ఓట్లపై ఏ వివరాలు బయటకు రావడం లేదు. పావన్ కళ్యాణ్ కరోనాతో క్వారంటైన్ లో ఉన్నారు. బీజేపీ ప్రచారంను హోరెత్తించింది. పార్టీకి లభించే ఓటు శాతాన్ని అంచనా వేసే పనులు ఇప్పుడు బీజేపీ పెద్దలున్నారు. ఏం జరుగుతుందనేది ఓట్ల కౌంటింగ్ రోజు తేలనుంది.