బుల్లెట్ రైలులో చంద్రుడిపై షికారు.. సాధ్యం చేస్తారట?

Update: 2022-07-18 01:30 GMT
చంద్రుడిపై కాలు పెట్టి మనిషి సాధించాడు. అంగారక గ్రహంపైకి రోవర్ లు పంపాడు. అంతరిక్ష మూలాలు తెలుసుకుంటున్నాడు. అయితే తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు పెద్ద స్కెచ్ గీశారు. చంద్ర, అంగారక గ్రహాలకు బుల్లెట్ రైలు సదుపాం కల్పించేందుకు జపాన్ ప్రణాళికలు సిద్ధం చేసింది.  భూమి గురుత్వాకర్షణ శక్తి, వాతావరణం, స్థలాకృతులను పోలి ఉండే ఓ గాజు నిర్మాణాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది.  

ఈ నిర్మాణంలో ఉన్న మానవులకు తాము తమ ఇంట్లో ఉన్నామనే భావన కలిగే విధంగా చేయాలని ఆలోచిస్తోంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే అంతరిక్ష యానం ఓ పెద్ద ముందడుగుగా మారనుంది.

జపాన్ లోని క్యోటో విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము కజిమా కన్ స్ట్రక్షన్ తో కలిసి ఓ ప్రణాళిక అమలు కోసం కృషి చేస్తున్నానని తెలిపారు.చంద్రుడు, అంగారక గ్రహాలపైకి మానవులు రాకపోకలు సాగించేందుకు అనువైన రవాణా సాధనాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. జపనీస్ పరిశోధకులు ఈ అంతర్ గ్రహ రవాణా వ్యవస్థకు హెక్సాట్రాక్ అని పేరు పెట్టారు. ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు ఈ హెక్సాట్రాక్ 1జీ గ్రావిటీని మెయింటేన్ చేస్తుందని..దీనివల్ల తక్కువ గురుత్వాకర్షణ శక్తికి గురికావడం వల్ల కలిగే ప్రభావాలను తగ్గించవచ్చునని పరిశోధకులు వెల్లడించారు.

రైళ్లలో ఆరు భుజాలు గల ఆకారంలో క్యాప్సూల్స్ ఉంటాయని.. వీటిని హెక్సాక్యాప్సూల్స్ అంటారని తెలిపారు. ఈ క్యాప్సూల్స్ మధ్యలో కదిలే పరికరం ఉంటుందన్నారు. భూమి-చంద్రుడు మధ్య అనుసంధానికి 15 మీటర్ల వ్యాస్థారం గల మినీ క్యాప్సూల్స్ ను తయారు చేస్తామని చెబుతున్నారు.

చంద్రుడు-అంగారకుడు మధ్య అనుసంధానికి 30 మీటర్ల వ్యాసార్థం గల క్యాప్సూల్స్ ను తయారు చేస్తామన్నారు. జర్మనీ, చైనాలలో మాగ్లెవ్ రైళ్ల కోసం ఉపయోగించే ఎలక్ట్రోమ్యాగ్నైటిక్ టెక్నాలజీ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు.

చంద్రుడిపై రైల్వే స్టేషన్ ను లూనార్ స్టేషన్ అని పిలుస్తామని.. దీనికి గేట్ వే శాటిలైట్ ను ఉపయోగిస్తామని చెప్పారు. అంగారకుడిపై రైల్వే స్టేషన్ ను మార్స్ స్టేషన్ అని పిలుస్తామని ఇది మార్షియన్ శాటిలైట్ ఫొటోస్ ఉంటుందని తెలిపారు.

అంతర్జాతీయ రోదసీ స్టేషన్ (ఐఎస్ఎస్) తర్వాత ఇది రాబోతున్నట్లు తెలుస్తోంది. రోదసీ రైలు స్పేస్ ఎక్స్ ప్రెస్ స్టాండర్డ్ గేజ్ ట్రాక్ పై నడుస్తుంది. ఈ ప్రయోగాలు విజయవంతమై ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరో 100 ఏళ్లు పట్టవచ్చని తెలుస్తోంది. 2050 నాటికి నిర్మించాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Tags:    

Similar News