పతకాన్ని నోట్లో పెట్టుకున్న మేయర్.. మెడల్ వద్దన్న అథ్లెట్‌

Update: 2021-08-15 10:30 GMT
జపాన్ రాజధాని టోక్యో వేదికగా విశ్వ క్రీడా సంబురాలు ఇటీవల జరిగిన సంగతి అందరరికీ విదితమే. ఇక ఈ టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు గతంలో కంటే మరిన్ని పతకాలు ఎక్కువగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. భారత్ తరఫున నీరచ్ చోప్రా ‘జావెలిన్ త్రో’ క్రీడాంశంలో గోల్డ్ మెడల్ సాధించి పెట్టగా, భారతీయులందరూ హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా భారత్‌కు ఏడు మెడల్స్ వచ్చాయి ఈ టోక్యో ఒలింపిక్స్‌లో.  ఈ సంగతులు ఇలా ఉంచితే.. ఆ దేశ క్రీడాకారుడికి గోల్డ్ మెడల్ వచ్చిన సందర్భంలో ఇటీవల దాన్ని ప్రదర్శించారు. ఓ నగర్ మేయర్ క్రీడాకారుడిని అభినందించి అంతటితో ఆగకుండా మెడల్‌ను నోట్లో పెట్టుకుని కొరికాడు. దాంతో సదరు మెడల్‌పై గాట్లు పడ్డాయి. అసలేం జరిగిందో ఇంకా డీటెయిల్డ్‌గా తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించి తద్వారా తమ దేశ ఖ్యాతిని చాటాలని ప్రతీ క్రీడాకారుడికి ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్లు కఠినమైన సాధించి ఒలింపిక్స్ వరకు వెళ్తారు. చివరి వరకు ప్రయత్నించి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే మెడల్ కోసం జీవితం మొత్తం కృషి చేస్తూ ఉంటారు. కాగా, అలానే జపాన్‌కు చెందిన అథ్లెట్ మియూ గోటో కృషి చేసంది. స్టాఫ్‌ బాల్‌లో గోల్డ్‌ మెడల్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలోనే తాజాగా జపాన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మియూ హాజరైంది. ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన ఆ నగర మేయర్‌ టకాషి కవామురా అథ్లెట్ మియూను ప్రశంసించారు.

దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినందుకుగాను థాంక్స్ చెప్పారు. ఆ తర్వాత మియూ నుంచి గోల్డ్ మెడల్‌ను తీసుకొని తన మెడలో వేసుకున్నాడు. అది చూసి అక్కడున్న వారు అందరూ  సంతోషించారు. ఇక మీడియా వారయితే వెంటనే సదరు దృశ్యాలను క్లిక్ మనిపించారు. అయితే, మేయర్ అంతటితో ఆగిపోయి ఉంటే సరిపోయేదు. కాని అంతటితో ఆగకుండా ముఖానికి ఉన్న మాస్క్‌ను తీసేసి ఆ గోల్డ్‌ మెడల్‌ను గట్టిగా కొరికేశాడు. అంతే మెడల్‌పై పంటిగాట్లు పడ్డాయి. బలమైన ఆ గాట్లు మనకు చూడగానే కనిపిస్తాయి. అది చూసిన అథ్లెట్ మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకుల్ని సంప్రదించింది. తన మెడల్ ఇలా అయిపోయిందంటూ పేర్కొనడంతో పాటుగా కొత్త మెడల్ ఇవ్వాలని కోరింది. దాంతో స్పందించిన నిర్వాహకులు ఆ మెడల్‌ను మార్చేందుకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీని సంప్రదించి సరేనని ఒప్పుకున్నారు.

ఈ క్రమంలోనే మెడల్‌ మార్పడికి అయ్యే ఖర్చును తామే భరిస్తామని ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. కాగా, మేయర్‌ చేసిన బాధ్యతారాహిత్యమైన ఈ పని పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అథ్లెట్‌ విజయాన్ని మేయర్ అగౌరవపర్చారంటూ ఆరోపిస్తున్నారు. ఈ మేయర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక ఈ విషయమై సదరు మేయర్‌ కూడా స్పందించారు. తన ప్రవర్తనకుగాను చింతిస్తున్నానని క్షమాపణలు తెలిపారు. మెడల్ రీప్లేస్‌మెంట్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని తాను భరిస్తానని ప్రకటించారు. అయితే, మేయర్ దుందుడుకు స్వభావం వల్లే ఇలా విమర్శల పాలయ్యాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News