ఇండియా, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్యన జరుగుతున్న టెస్టు మ్యాచ్ ల వేళ ఒక తప్పనిసరి వినోదంగా మారింది జార్వో 69 వ్యవహారం. మ్యాచ్ సీరియస్ గా సాగుతున్న వేళ షడన్ గా మైదానంలోకి ఎంట్రీ ఇస్తుంటాడు జార్వో. తన సరదా వ్యవహారంతో అందరినీ నవ్విస్తుంటాడు. అచ్చం టీమిండియా జెర్సీతో బ్యాటో, బంతో పట్టుకుని జార్వో 69 మైదానంలోకి వెళతాడు. అక్కడ అభ్యంతరం చెప్పిన వారితో తను కూడా టీమిండియా ప్లేయర్ నే అంటూ జెర్సీ మీదున్న లోగోను చూపిస్తాడు. మైదానంలోంచి బయటకు వెళ్లనంటాడు. చివరకు సిబ్బంది ఇతడిని ఎత్తుకుని బయటకు తీసుకెళ్లిపోతారు.
ఇది ఒకసారి కాదు.. వరసగా మూడుసార్లు రిపీట్ అయ్యింది. లార్డ్స్ టెస్టులో తొలిసారి జార్వో రంగంలోకి దిగాడు. టీమిండియా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇతడు మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తను కూడా టీమిండియా ప్లేయర్ నంటూ వారితో కలిసిపోయే ప్రయత్నం చేశాడు. సిబ్బంది వచ్చి జార్వోను పట్టుకెళ్లింది. మొదటి సారి అలా నవ్వులపూవులు పూయించాడు జార్వో. దీంతో ఇతడు ఎవరనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా నిలిచింది. జార్వో ఎవరనే అంశంపై అంతా నెట్ లో సెర్చ్ చేశాడు.
ఇతడు ఒక ఫుల్ టైమ్ ట్రోలర్ అనే విషయం బయటపడింది. ఉద్యోగాన్ని వదిలి ఇంటర్నెట్ లో ట్రోలర్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా మారే ప్రయత్నంలో ఉన్నాడని అందుకే ఈ మ్యాచ్ లను ఉపయోగించుకుంటున్నాడని తెలిసింది. మొదటిసారి ఇతడిని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్ గా తీసుకోలేదు. లార్డ్స్ కూడా ఇతడిని సరదాగా తీసుకుంది. అయితే లీడ్స్ టెస్టులో కూడా జార్వో అదే కథ రిపీట్ చేశాడు. టీమిండియా బ్యాటింగ్ అప్పుడు రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత.. విరాట్ క్రీజ్ లోకి రావడానికి ముందు జార్వో బ్యాట్ పట్టుకెళ్లాడు. గార్డు తీసుకోబోయాడు. పిచ్ మీదకు ఇతడు రావడంతో అంపైర్లు అభ్యంతరం చెప్పడం, సిబ్బంది వచ్చి తీసుకెళ్లిపోవడం చకచకా జరిగింది. ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్ స్టో కూడా జార్వోపై ఆగ్రహం వ్యక్తం చేశాడప్పుడు.
ఇక తాజా ఓవల్ టెస్టులో కూడా అదే కథ. మళ్లీ జార్వో రంగంలోకి దిగాడు. ఈ సారి బెయిర్ స్టో బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో గ్యాప్ రాగా.. తను బాల్ తో వెళ్లిపోయాడు జార్వో. తను బౌల్ చేస్తానన్నాడు. మళ్లీ సిబ్బంది రాక తప్పలేదు.
అయితే ఈ సారి బయటకు తీసుకెళ్లిపోవడమే కాదు.. జార్వో ను అరెస్టు కూడా చేశారు. అనుమానాస్పద స్థితిలో పదే పదే మ్యాచ్ లకు ఆటంకాలు కల్పించడం అనే ఆరోపణతో జార్వోపై కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ తుంటరి లండన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. మరి సరదాగా అని ఇతడిని వదిలేస్తారో.. లేక తీవ్రమైన నేరం కింద పరిగణించి ఇప్పుడప్పుడే వదలరో! తుది టెస్టు సమయానికి జార్వో మళ్లీ మైదానంలోకి దిగగలడో లేదో!