ఐపీఎల్లో జాతి వివక్షను కనీసం గుర్తించరా..హోల్డర్ ఫైర్

Update: 2020-10-23 07:30 GMT
అమెరికాలో నల్లజాతీయులైన  జార్జ్ ప్లాయిడ్,డేనియల్ ప్రుడే,   హత్య, జాకబ్ బ్లేక్ పై  హత్యాయత్నం ఘటనలపై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ లైవ్ మ్యాటర్స్ పేరుతో ఉద్యమం చేస్తున్నారు. అయితే ఐపీఎల్లో ఆ ఉద్యమానికి మద్దతు లభించక పోవడంపై వెస్టిండీస్‌ క్రికెటర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌  నిరాశ వ్యక్తం చేశాడు. అమెరికాలో నల్ల జాతీయులు వివక్షకు గురవుతున్నారు. ఎంతలా అంటే ఎటువంటి కారణాలు కూడా లేకుండా చంపేంతలా. జార్జ్ ప్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని అమెరికా పోలీసులు ఏ కారణం లేకుండానే అతడిని చిత్రహింసలు పెట్టి చంపేయడంపై ఆ దేశంలోని నల్లజాతీయులు భగ్గుమంటున్నారు.తాము ఎదుర్కొంటున్న  వివక్షకు వ్యతిరేకంగా బ్లాక్ లైవ్ మ్యాటర్స్ పేరుతో ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో పాలుపంచుకునేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు అనుమతి ఇచ్చింది. ఐసీసీ కూడా అంగీకారం ప్రకటించింది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అక్కడి వారు బ్లాక్ లైవ్ మ్యాటర్స్ కు మద్దతు తెలిపారు.

విండీస్‌ జట్టు తరఫున ప్రతిష్టాత్మక పీటర్‌ స్మిత్‌ అవార్డు స్వీకరణ సందర్భంగా హోల్డర్‌ వర్చువల్‌ కార్యక్రమంలో మాట్లాడాడు. 'నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ ఉద్యమం జరుగుతుంటే  ఐపీఎల్‌లో దాని ప్రస్తావనే ప్రస్తావనే లేకపోవడం తీవ్ర నిరాశను కల్గించింది.

అసలు ఉద్యమాన్ని కూడా గుర్తించకపోవడం చాలా నిరాశ కల్గిస్తోంది. అంతా ఏకమైతేనే నల్ల జాతీయులపై వివక్షను అడ్డుకోగలం, ' అని హోల్డర్ అన్నారు. అమెరికాలో నల్లజాతీయులపై వరుస దాడులు జరుగుతున్న  నేపథ్యంలో వారికి ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న జాతియులు మద్దతుగా నిలిచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో అసలు ఆ ప్రస్తావనే తేకపోవడం బాధించిందని జేసన్ హోల్డర్ పేర్కొన్నారు.
Tags:    

Similar News