ప్రభుత్వం మీద విమర్శలు సంధించటం.. ప్రభుత్వ పని తీరులోని లోపాలు ఎత్తి చూపించటం.. అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రముఖంగా ప్రస్తావించటం.. అధికారపక్షం తీసుకునే నిర్ణయాలను విమర్శించటం ప్రజాస్వామ్యంలో మామూలే. కానీ..ఇలాంటివి ఎక్కడైనా చేయొచ్చు కానీ తమిళనాడులో మాత్రం చేయకూడదు. ఒకవేళ చేసే సాహసం చేస్తే.. పక్కరోజుకు సదరు పత్రికకు పరువు నష్టం కేసు కత్తి వేలాడుతుంది. ఇదేదో ఉత్త మాటగా చెప్పటం లేదు. ప్రస్తుతం ఇలాంటి పరువునష్టం కేసుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విలేకర్లు.. పత్రికలు.. మీడియా సంస్థలు 200 వరకు ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తమ సర్కారు మీద ఇసుమంత విమర్శను సైతం సహించలేని జయలలితమ్మ సర్కారు.. తమను విమర్శిస్తూ ఎవరైనా కథనం ప్రచురిస్తే చాలు.. వెనువెంటనే వారికి నోటీసులు జారీ చేస్తారు. ఇక.. ప్రకటనల సంగతి చెప్పాల్సిన అవసరమే ఉంది. తాజాగా తీవ్రస్థాయిలో వరదలు.. భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం దారుణంగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. ప్రకృతి విపత్తు సందర్భంగా ప్రభుత్వం చేష్టలుడిగిపోయినట్లుగా కనిపించింది.
నేతలు.. అధికారపక్ష కార్యకర్తలు.. అధికారులు పత్తా లేని పరిస్థితి. యువకులు.. ఎన్జీవోలు.. కేంద్రసహాయక బృందాల సేవలే అత్యధికం. వరద పోటు కాస్త తగ్గిన తర్వాత కానీ ప్రభుత్వ యంత్రాంగం జాడ కాస్త కనిపించిందని చెప్పొచ్చు. అదే సమయంలో.. అధికారపక్షానికి చెందిన ఛోటా నేతలు.. కార్యకర్తల ఆరాచకం మరింత పెరిగింది. చెన్నై ప్రజల్ని ఆదుకునేందుకు వస్తున్న సహాయ సామాగ్రిని అడ్డుకోవటం.. తాము చెప్పిన వారికే ఇవ్వాలనటం.. లేదంటే సహాయక సామాగ్రిని తమకు అప్పజెప్పి వెళ్లిపోవాలంటూ బెదిరించటం లాంటి పలు ఉదంతాలు టీవీల్లో కనిపించాయి.
ప్రతికల మీద అమ్మ సర్కారు వ్యవహరించే ధోరణితో బెదిరిపోతున్న విలేకరులు.. తమిళనాడు అధికారపక్షానికి వ్యతిరేకంగా వార్తలు రాయాలంటే వణికిపోతున్న పరిస్థితి. తాజాగా.. చెన్నై కవరేజికి వెళ్లే జాతీయ మీడియా ప్రతినిధులకు.. తమ కష్టాలు చెప్పుకొని.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని వారికి చూపిస్తున్నారు. ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ మీదనే దాదాపు 100కు పైగా పరువు నష్టం కేసుల్ని ఎదుర్కొంటోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పొచ్చంటున్నారు. పరువు నష్టం దావాల విషయంలో తమిళనాడు సర్కారు దాహాంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయటమే కాదు.. ప్రభుత్వంపై విమర్శల్ని వ్యక్తిగత అసహనంగా పరిగణించటం మానాలంటూ ఈ నవంబరు 30న జస్టిస్ దీపక్ మిశ్రా.. జస్టిస్ ప్రపుల్ల పంత్ ల ధర్మాసనం పేర్కొనటం చూసినప్పుడు.. అక్షరం మీద అమ్మ అసహనం ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది. పేరుకు అమ్మే కానీ.. వ్యవహారశైలి మొత్తం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.