అమ్మ మృతిపై ఇప్పటికే ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూరేలా అమ్మ డ్రైవర్ గా వ్యవహరించిన వ్యక్తి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనారోగ్యంతో అమ్మను అపోలోఆసుపత్రిలో చేర్చటం.. ఆమెకు చికిత్స జరిగిన 75 రోజుల పాటు చిన్నమ్మ శశికళ తప్పించి.. మరెవరికీ అనుమతి లేకపోవటం.. అపోలో ఆసుపత్రిలో సీసీ కెమేరాల్ని తొలగించటం.. అమ్మను ఆసుపత్రికి తరలించిన వేళలో జరిగిన ఉదంతాలపై ఇప్పటికే ప్రచారంలో ఉన్న వాదనలకు తగ్గట్లే.. తాజాగా అమ్మ డ్రైవర్ గా వ్యవహరించిన దివాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనానికి తెర తీస్తున్నాయి.
జయలలిత కొడనాడు ఎస్టేట్ డ్రైవర్ గా వ్యవహరించిన 42 ఏళ్ల దివాకర్ నోరు విప్పి వెల్లడించిన సంగతులు విన్న వారంతా విస్తుపోతున్నారు. 2005 నుంచి 2009 వరకు.. అంటే నాలుగేళ్లు డ్రైవర్ గా పని చేసిన దివాకర్ మాటలు విన్న వారికి.. చిన్నమ్మ మైండ్ సెట్ మరీ ఇంత విపరీతమా అని ఫీల్ అవుతున్నారు. ఇంతకీ దివాకర్ ఏం చెప్పారో చూస్తే.. అమ్మ ఎవరితోనైనా ప్రేమగా వ్యవహరిస్తే చిన్నమ్మ అస్సలు తట్టుకునేవారు కారని చెప్పారు.
చిన్నమ్మ మైండ్ సెట్ విపరీతధోరణితో ఉండేదన్నారు. అమ్మ ఎవరితోనైనా ప్రేమగా వ్యవహరిస్తే.. వారిని గుర్తు పెట్టుకొని మరీ శశికళ వేధించేవారని చెప్పారు. కక్ష సాధించే రీతిలో ఆమె తీరులో ఉండేదని.. తనకు తెలిసీ ఎస్టేట్ నుంచి నలుగురు డ్రైవర్లను ఇదే కారణం మీద తీసి వేసినట్లుగా చెప్పారు. అమ్మ మరణంపై తనకూ అనుమానాలు ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. కారు డ్రైవర్ వ్యాఖ్యలు చిన్నమ్మను వ్యతిరేకించే వారి సందేహాలకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/