తీవ్ర అనారోగ్యంతో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఒక సమాచారం (సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో) ఇప్పుడే అందింది. పదమూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరటం తెలిసిందే. అయితే.. ఆమె ఆరోగ్యం విషమించిందని.. కోమాలోకి వెళ్లారంటూ కొందరు.. కాదు.. ఆమెకు జరగరానిది జరిగిపోయిందంటూ మరికొందరు విషపు ప్రచారం చేశారు. దీనికి తోడు తమిళనాడు ప్రభుత్వం కానీ.. అధికారపక్షానికి చెందిన నేతలు అనుసరించిన తీరు.. ప్రజల్లో పలు సందేహాలకు తావిచ్చేలా ఉందని చెప్పక తప్పదు. జయలలిత అనారోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేసే హెల్త్ బులిటెన్లలో స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేది. ఒక సీఎం.. రెండు వారాల పాటు ఆసుపత్రిలో ఉండిపోవటం.. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని బయట పెట్టే విషయంలో అనుసరించిన వైనం మిస్టరీని తలపించేలా ఉందనటంలో సందేహం లేదు.
ఇదిలా ఉంటే.. అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని.. ఆమె కోలుకోవటానికి మరికొంత సమయం పడుతుందని.. ఆసుపత్రిలో మరిన్ని రోజులు ఉండాలంటూ అపోలో వైద్యులు ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం.. ఈ రోజు ఉదయం అమ్మ స్పృహలోకి రావటమే కాదు.. కళ్లు కూడా తెరిచారని.. ఆమెకు చేస్తున్న చికత్స మెరుగైన ఫలితాలు ఇవ్వటంతో పాటు.. ఆమె కోలుకుంటారనటానికి తాజా పరిణామం కీలకంగా వైద్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామం అమ్మను విపరీతంగా అభిమానించే వారికి.. ఆరాధించే వారికి శుభవార్తగా చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఆసుపత్రి వర్గాలు తమ హెల్త్ బులిటెన్ల రూపంలో వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/