సుమారు 75 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి మృత్యువుతో పోరాటం అనంతరం తుది శ్వాస విడిచిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం విషయంలో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. రెండున్నర నెలల కాలం అమ్మకు ఆస్పత్రిలో అందించిన సేవల బిల్లు సుమారు 75 కోట్లు అయిందని పేర్కొంటూ ఈ మేరకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను నిధులను కూడా దారి మళ్లించి చెల్లించిందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా వట్టిదేనని తమిళనాడు అధికార వర్గాలు తెలిపాయి. అమ్మ ఆస్పత్రికి బిల్లు కేవలం ఆరుకోట్ల ఖర్చయిందని వివరించారు.
అమ్మకు అందించిన అత్యుత్తమ సేవల కోసం 90 కోట్ల బిల్లును అపోలో ఆసుపత్రి డిమాండ్ చేయగా ప్రభుత్వం చెల్లించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం సరికాదని అధికారులు తెలిపారు. ఏ పథకాల నిధులను దివంగత సీఎం జయలలిత వైద్యం కోసం ఖర్చు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. పైగా అపోలో యాజమాన్యం బిల్లులు చెల్లించాలని తమను కోరనలేదని వారు స్పష్టం చేశారు. అనవసర ప్రచారాలు సరికాదని హితవు పలికారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/