ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రముఖురాలు ఎంతమాత్రం కాదు. కానీ.. కోట్ల మందికి దక్కని భాగ్యం ఆమెకు మాత్రమే దక్కిందని తమిళులు అనుకుంటున్నారు. తమ ఆరాధ్యదైవం.. అమ్మ లాంటి జయలలితకు ఆఖరి శ్వాస వరకూ సపర్యలు చేసిన ఆమె ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జయలలిత ఇంట్లో.. ఆమె వ్యక్తిగత అవసరాలు తీర్చటం కోసం.. ఆమెకు సపర్యలు చేసేందుకు ఒక మహిళ ఉంటారు.
బయటకు ఎక్కువగా ఫోకస్ కాని ఈమె.. జయలలితకు సేవలు చేసేది. అమ్మ అంతా ఆధారపడింది ఆమె మీదనే అని చెబుతుంటారు. అనారోగ్యంతో 75 రోజుల క్రితం అపోలో ఆసుపత్రికి అమ్మను తీసుకెళ్లిన వేళ.. ఈ మహిళ అమ్మతోనే ఉన్నారు. జయలలిత అంతిమ శ్వాస విడిచే వరకూ ఆమె చెంతనే ఉంటూ.. ఆమెకు సేవ చేస్తూ ఉండిపోయారు. అమ్మ ఆఖరి శ్వాస విడిచిన తర్వాత తీవ్రమైన విషాదంతో బయటకు వచ్చిన ఆమెను చూసిన పలువురు అమ్మ అభిమానులు.. ఆమె చుట్టూ చేరిపోయారు. చివరి వరకూ అమ్మకు అమ్మలా సపర్యలు చేసి నువ్వు రుణం తీర్చుకున్నావ్.. మేం ఏం పాపం చేశామో మాకిలాంటి అవకాశం దక్కలేదంటూ వారు పెట్టిన శోకాలతో ఆ మహిళ మరింత విషాదానికి గురయ్యారు. అమ్మకు అమ్మలా సేవ చేసిన ఆ మహిళకు మాత్రమే.. అమ్మకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసని చెబుతారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/