సంచలనం సృష్టించిన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తుది తీర్పు ఈరోజు కర్నాటక హైకోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ కోర్టు తీర్పుతో జయలలితకు ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే! సుమారు 20 సంవత్సరాలకు పైగా సాగిన ఈ కేసు పూర్తి వివరాలు ఒక్కసారి పరిశీలిద్ధాం...
1991 - 96 మధ్యకాలంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాస్తులు సంపాదించారని బీజేపీనేత సుబ్రమణ్య స్వామి స్పెషల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబందించి 1996 - డిసెంబర్ 7 న జయలలితను అరెస్ట్ చేశారు! ఈకేసుకు సంబందించి జయలలితతో పాటు మరో ముగ్గురిపై 1997 లో సెషన్స్ కోర్టు విచారణ సాగించింది! అప్పటినుండి అలా సాగుతూ సాగుతూ వచ్చిన ఈ కేసు 2015 మే 11 తో ముగిసింది!
1997 జూన్ 4న జయలలిత, మరో ముగ్గురిపై 120 - బి ఐపీసీ, 13(2), 13(1) సెక్షన్ల కింద చార్జిషీట్ నమోదుకు చేయాలని కోర్టు ఆదేశించింది!
దీనిపై జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను 1997లో మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.
ఇక ఆగస్టు - 2000 లో ఈ కేసుకు సంబందించి పలువురు సాక్ష్యులను కోర్టు విచారించింది!
అదే ఏడాది అక్టోబరులో తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల శాఖలో అవినీతికి పాల్పడినట్లు జయలలితపై అభియోగాలు నమోదయ్యాయి! అయితే ఈ అభియోగాలను సుప్రీంకోర్టు రద్ధుచేసింది!
అనంతరం తమిళనాడు 2001లో జరిగిన అసెంబ్లీకి ఎన్నికల్లో అన్నా డీఎంకేకు పూర్తి మెజారిటీ సాధించింది! అప్పటికి జయలలితపై అభియోగాలు ఉండటంతో... అప్పటి ఎన్నికలకు దూరంగా ఉన్న జయ ఆ తర్వాత ఉపఎన్నికల్లో గెలిచి ఫిబ్రవరి 12 - 2002 న ప్రమాణ స్వీకారం చేశారు!
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడం వల్ల కేసు తప్పుదోవపట్టే అవకాశం ఉందని, ఆ కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటకు బదిలీ చేయాలని 2003 లో డీఎంకే జనరల్ సెక్రటరీ కె అన్ బాంజ్ గాన్ పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు అంగీకరించిన సుప్రీం... ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేసింది!
అప్పటి నుండి సాగిన ఈ కేసు జయలలితతో పాటు మరో ముగ్గురు (శశికళ, సుధాకరన్, ఇళవరసి) లను దోషులుగా తేల్చుతూ 2014 సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించింది! వీరికి నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల జరిమానా శిక్షగా విదించింది!
అయితే 2014 సెప్టెంబర్ 29న ఈ తీర్పును సవాలుచేస్తూ, బెయిల్ కోరుతూ కర్ణాటక హైకోర్టును జయలలిత అండ్ కో ఆశ్రయించారు.
బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు, బెయిల్ ఇవ్వడానికి సరైన కారణాలు లేవని స్పష్టం చేస్తూ అక్టోబర్ 7 - 2014 న ప్రకటించింది!
అయితే మరో సారి అక్టోబర్ 9 - 2014 బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది జయలలిత!
ఈ క్రమంలో జయలలితకు సుప్రీంకోర్టు అక్టోబర్ 17 - 2014 న బెయిల్ మంజూరు చేసింది.
తాజాగా... అక్రమాస్తుల కేసులో జయలలిత, మరో ముగ్గురు నిర్దోషులంటూ కర్ణాటక హైకోర్టు 2015 మే 11 న ప్రకటన చేసింది!