గుడ్ న్యూస్: అమ్మ స్పందిస్తున్నారట!

Update: 2016-10-10 04:27 GMT
గత 18రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తమిళనాడే కాదు - దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. అస్వస్థతతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈమె ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు - అనుమానాలు - ఎన్నో రకలా వదంతులు. వీటన్నింటినీ తుడిచిపెడుతూ తాజాగా అమ్మ అభిమానులకు - అన్నాడీఎంకే కార్యకర్తలకు - ప్రజలందరికీ ఒక శుభవార్తలాంటి విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది... అదేమిటంటే... ఇన్నిరోజులూ స్పందన లేకుండా ఉన్న జయలలిత స్పందిస్తున్నారని - చేతులతో సైగలు చేస్తున్నారని - వినిపించీ వినిపించనట్లు మాట్లాడుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో అన్నాడీఎంకేలోని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అనే మాటతో మరికిన్ని గుడ్ న్యూస్ లు తాజాగా హల్ చల్ చేస్తున్నాయి.

అవును... అమ్మ కోలుకుంటున్నారు. అపోలో వైద్యబృందం - లండన వైద్యుడు డాక్టర్‌ జాన రిచర్డ్‌ బీలే - ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఇచ్చిన చికిత్సతో ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం వెంటిలేటర్‌ పైనే చికిత్స పొందుతున్న జయ... ఆదివారం మధ్యాహ్నం సమయంలో కళ్లు తెరవడంతో పాటు మెల్లిగా వైద్యులతో ముందుగా సైగలతోనూ - తర్వాత నోటితోనూ మాట్లాడినట్లు ఆ కథనాలు వెళ్లడిస్తున్నాయి. ఇదే సమయంలో అసలు తనకేమైందంటూ సైగలతో వైద్యులను ప్రశ్నించారని కూడా ఆ కథనాల సారాంశం!

ఈ వార్తతో ఒక్కసారిగా అన్నాడీఎంకే కార్యకర్తలకు - మంత్రులు - అమ్మ అభిమానులు ఎంతో ఆనందాన్ని కలిగించాయట. సుమారు రెండు వారాల తరువాత పార్టీ వర్గాల్లో కొంత ఉత్సాహం కనిపించిందట. ఇదే సమయంలో... జయకు రక్తపోటు - చక్కెర శాతం సాధారణ స్థితికి వచ్చాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో ఆమెను ఇంటికి పంపించే అవకాశముందని అపోలో వర్గాలు చెబుతున్నాయట. ఇలాంటి కథనం తాజాగా వెలుగులోకి రావడంతో అమ్మ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు!! అయితే... అమ్మ ఆరోగ్యంపై వదంతులు ఎక్కువగ రావడంతో ఆపద్ధర్మంగా ఉపముఖ్యమంత్రిని నియమించాలన్న ఆలోచనపై అన్నాడీఎంకే ఒక నిర్ణయానికి వచ్చింది. పరిపాలనాపరమైన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నందున అలాంటి ఆలోచన అవసరం లేదని ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్‌ కు పంపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News