జ‌య 28 కిలోల బంగారం అక్క‌డే ఉంది

Update: 2016-12-08 16:48 GMT
జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో అంద‌రి దృష్టీ ఇప్పుడిక ఆమె రాజ‌కీయ వార‌స‌త్వం మీద నిలిచింది. అలాగే అపార‌మైన జ‌య‌లలిత ఆస్తులు ఏమ‌వుతాయి.. అవి ఎవ‌రి ప‌రం అవుతాయి అన్న చ‌ర్చా మొద‌లైంది. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని ఆస్తుల సంగ‌తేమో కానీ.. అంద‌రికీ తెలిసిన సంప‌దకు ఎవ‌రికి సొంత‌మ‌వుతుంద‌న్న ఉత్కంఠ కూడా ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది.

జయలలిత నివాసంపై 1995లో భారీ సంఖ్యలో ఐటీ అధికారులు దాడి చేయ‌డం.. ఆ సంద‌ర్భంగా 28 కిలోల బంగారం.. 800 కిలోల వెండి.. 10వేల చీరలు.. 91 వాచీలు.. 44 ఎయిర్ కండిషనర్లు.. 750 జతల చెప్పులు బ‌య‌ట‌ప‌డ‌టం తెలిసిన సంగ‌తే. వీట‌న్నింటినీ అప్పుడు అధికారులు సొంతం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేర‌కు ఈ సంప‌ద అంతా సీజ్ చేసి.. ట్రెజ‌రీకి త‌ర‌లించారు.

రెండు ద‌శాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో జ‌య‌ల‌లిత కొన్ని నెల‌ల పాటు జైలు శిక్ష కూడా అనుభ‌వించారు. ఐతే ఈ ఏడాది ఆమె బెయిల్ మీద బెయిల్ మీద బ‌య‌టికి రావ‌డం.. కేసు పెండింగ్ లో ప‌డ‌టం తెలిసిందే. ఇంత‌లోనే జ‌య‌ల‌లిత కాలం చేశారు. బంగారం స‌హా ఆమె సంప‌దంతా ప్ర‌స్తుతం ట్రెజ‌రీలోనే ఉంది. ఈ కేసు ఎప్ప‌టికి తెమ‌లుతుందో.. చివ‌ర‌గా ఎలాంటి తీర్పు వ‌స్తుందో తెలియ‌డం లేదు. మ‌రి ఆమె న‌గ‌లు ఇత‌ర సంప‌ద అంతా చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి.
Tags:    

Similar News