అమ్మ పేపర్లు కూడా చదువుతున్నారట!!

Update: 2016-10-13 09:49 GMT
దాదాపు మూడు వారాలకు పైనే అమ్మ ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమెను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు.. బీజేపీ అధినేత అమిత్ షా వరకూ చాలామంది ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లారు. అయితే..ఇలా వెళ్లిన వారు ఎవరూ అమ్మను కలిసింది లేదు. ఆమెను పరామర్శించింది లేదు. చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్న ఆమెకు సంబంధించిన వివరాల్ని.. ఆమెకు వైద్యం చేస్తున్న వారిని వాకబు చేయటం.. వారిచ్చిన సమాచారం తీసుకోవటం మాత్రమే చేస్తున్నారు.

ఎవరు పడితే వారు వెళితే అమ్మ ఆరోగ్యానికి ఇబ్బందని.. ఇన్ఫెక్షన్లు అంటే అవకాశం ఉండటంతో వైద్యులు ఎవరిని అమ్మ దగ్గరకు అనుమతించటం లేదని చెబుతున్నారు.ఇదిలా ఉంటే.. అమ్మ అసలు స్పృహలో ఉన్నారా? ఆమె మాట్లాడుతున్నారా? అన్న విషయంపై పలు సందేహాలు ఉన్నాయి. ఇవి తీరక ముందే.. అమ్మ వద్ద ఉన్న మంత్రిత్వ శాఖల్ని ఆమె వీర విధేయుడు పన్నీరు సెల్వంకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమ్మ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఆమె ఓకే అన్నాకే ఇదంతా జరిగిందని అన్నాడీఎంకే పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తమిళనాడు విపక్షాల వాదన వేరుగా ఉంది. అసలు అమ్మ స్పృహలోనే ఉన్నారా? అని సూటి ప్రశ్న వేస్తున్నారు. దీనికి స్పందిస్తున్న అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి మాట్లాడుతూ.. పన్నీరు సెల్వంకు బాధ్యతలు అప్పగించే అంశాన్ని అమ్మకు వైద్యులుచెప్పారని.. ఆమె అందుకు సరే అన్న సందేశాన్ని పంపినట్లుగా చెప్పటం గమనార్హం. అమ్మ వద్దకు ప్రస్తుతం డాక్టర్లు మాత్రమే వెళుతున్నారని.. ఆమెకు అందాల్సిన సందేశాల్ని వారే ఆమెకు అందిస్తున్నారని ఆమె చెబుతున్నారు.

అమ్మ స్పృహలో ఉండటమే కాదు.. పేపర్లు కూడా చదువుతున్న విషయాన్ని వైద్యులు తమకు చెప్పినట్లుగా ఆమె చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అమ్మ నిర్వహిస్తున్న శాఖల్ని పన్నీరు సెల్వంకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్ మీద అమ్మ సంతకం చేశారా? అన్న సందేహాల్నివిపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వర్గాలు మాత్రం అమ్మకు తెలీకుండా ఒక్క నిర్ణయం కూడా తీసుకోవటం లేదని స్పష్టం చేయటం గమనార్హం. పేపర్లు చదివే ఓపిక ఉన్న అమ్మ.. పన్నీరు సెల్వంకు బాధ్యతులు అప్పగించాలన్న అంశానికి సంబంధించి అమ్మ చేసిన సంతకం కాపీని అధికారికంగా విడుదల చేస్తే సరిపోతుంది కదా? అది సాధ్యం కాదంటే.. ఏదైనా ఒక వీడియో సందేశం పంపితే మరింత క్లారిటీ ఉంటుంది కదా? అలాంటి పనుల్ని అన్నాడీఎంకే నేతలు ఎందుకు చేయరు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News