షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. అమ్మ.. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అంత్యక్రియల్ని మరోసారి నిర్వహించారు. కాకుంటే.. అమ్మ రూపంలో ఉండే బొమ్మకు.. హిందూ సంప్రదాయాల ప్రకారం.. అమ్మ బంధువులు శ్రీరంగపట్నంలోని కావేరీ నదీ ఒడ్డున అంత్యక్రియలు జరిపారు. అమ్మ మరణించిన తర్వాత.. ఆమెకు హిందూ సంప్రదాయాల ప్రకారం.. ఆమెను దహనం చేయకుండా.. ఖననం చేసిన విషయం తెలిసిందే.
ఇలా చేస్తే.. ఆమె ఆత్మకు మోక్షం లభించదన్నది ఆమె బంధువుల వాదన. అందుకే.. ఆమె ఆత్మకు విముక్తి కలగాలన్న ఉద్దేశంతో తాము జయకు మళ్లీ అంత్యక్రియల్ని జరపాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అమ్మకు ప్రతిరూపంగా.. అచ్చం అమ్మలా ఉండే ఒక బొమ్మను తయారు చేశారు. దానికి హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాదు.. ఐదు రోజుల పాటు ఆమె ఆత్మకు శాంతి కలిగేలా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ చేశారు.
మరీ.. అంత్యక్రియలు ఎవరు చేశారు? ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. జయలలితకు సోదరుడు వరస అయ్యే వరదరాజు అంత్యక్రియల్ని నిర్వహించారు. తమ సోదరి నాస్తికురాలు కాదని.. ఒకవేళ ఆమె కానీ నాస్తికురాలు అయితే.. అన్నిసార్లు గుళ్లకు ఎందుకు వెళ్లేదని ప్రశ్నిస్తున్నారు. జయ కానీ నాస్తికురాలు అయితే.. ఆమె గుళ్లకు వెళ్లేది కాదని.. హిందూ ఆచారాల్ని..సంప్రదాయాల్ని పాటించేది కాదని.. కానీ.. అందుకు భిన్నంగా ఆమె దేవాలయాలకు వెళ్లటం.. హిందూ ఆచారాల్ని పాటించే వారని గుర్తు చేశారు. అందుకే.. ఆమెకు మళ్లీ అంత్యక్రియల్ని నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఈ అంత్యక్రియలకు జయ బంధువులు పలువురు హాజరు కావటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/