తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విషయంలో మరో అనూహ్య వార్త వెలుగులోకి వచ్చింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా సంతకం చేశారు. ఔనా! అదెలాగా? అంటే అదే జిమ్మిక్కు. గత ఏడాది జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే ఆ రాష్ట్రంలోని తంజావూరు - అరవకురిచ్చి - తిరప్పరగుండ్ర ఉప ఎన్నికలు జరిగాయి. అయితే దీనిపై వివాదం రేగింది. ఎందుకంటే...జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే పార్టీ నేతల బీ ఫాం మీద జయలలిత వేలిముద్రలు వేసి ఉండటం వెలుగులోకి రావడం వల్ల!
జయలలిత హాస్పటల్లో ఉన్నప్పుడు తిరుప్పరన్ కుంద్రమ్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోస్ విజయం సాధించారు. ఆ విక్టరీని డీఎంకే అభ్యర్థి శరవనన్ కోర్టులో సవాల్ చేశారు. అన్నాడీఎంకే అభ్యర్థి బోస్ సమర్పించిన బీ-ఫారమ్ పై డీఎంకే అభ్యర్థి అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ బీ-ఫారమ్‌పై ఉన్న వేలిముద్ర మాజీ సీఎం జయలలితది కాదు అని డీఎంకే కేసు వేసింది. అయితే ఆ వేలి ముద్ర మాజీ సీఎం జయలలితదే అని ప్రభుత్వ డాక్టర్ పీ బాలాజీ ధ్రువీకరించారు.
పోలింగ్ డాక్యుమెంట్లపై ఉన్న వేలిముద్రలు జయవే అని ఆయన స్పష్టం చేశారు. బీ-ఫారమ్ లో ఉన్న వివరాలను చదివిన తర్వాత.. జయనే ఆ వేలిముద్ర వేసినట్లు డాక్టర్ బాలాజీ.. మద్రాస్ హైకోర్టుకు విన్నవించారు. వేలిముద్ర వేసిన సమయంలో జయ పక్కన ఆమె స్నేహితురాలు వీకే శశికళ మాత్రమే ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. 2016 - అక్టోబర్ 27 సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ వేలిముద్రలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆ రోజున పళనిస్వామి - పన్నీరుసెల్వంను కలవలేదన్నారు.