తమిళనాడు ముఖ్యమంత్రి.. అమ్మగా అందరి మనసుల్లో నిలిచిపోయిన జయలలిత అంత్యక్రియలకు సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం వచ్చింది. తొలుత అనుకుంటున్నట్లుగా బుధవారం కాకుండా.. ఈ రోజు సాయంత్రమే ఆమె అంత్యక్రియల్ని చేపట్టాలని నిర్ణయించారు. అపోలో ఆసుపత్రి నుంచి పార్థిప శరీరాన్ని బయటకు తీసుకొచ్చే వేళ.. ఆమె నెచ్చెలి శశికళ ఉన్నారు.
అనంతరం ఆమె కాన్వాయ్ లో ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్ కు తీసుకెళ్లి.. అక్కడ కాసేపు ఉంచారు. అనంతరం ప్రజల సందర్శనార్థం ఆమెను రాజాజీ పబ్లిక్ హాల్ కు తరలించారు. దేశంలోని ప్రముఖులంతా ఇవాళ సాయంత్రం ఐదు – ఆరు గంటల మధ్య జరిగే అంత్యక్రియలకు హాజరు కానున్నారు. ఇక.. ఆమె శాశ్వితనిద్రకు సైతం వేదికను ఎంపిక చేశారు.
జయలలితకు గురువు.. ఆరాధ్యదైవంగా భావించే ఏంజీఆర్ సమాధి పక్కనే అమ్మఅంత్యక్రియల్ని పూర్తి చేయనున్నారు. గురువు చెంతనే శిష్యురాలి శాశ్విత నిద్ర అన్న మాట. ఏంజీఆర్ చనిపోయినప్పుడు.. ఆయన అంతిమ యాత్రలో ఆమెను పాల్గొనేందుకు సైతం ఒప్పుకోని పార్టీలో తిరుగులేని అధినేత్రిగా ఎదగటమే కాదు.. ఆయన చెంతనే తన స్థానాన్ని శాశ్వితం చేసుకోవటం పురిట్చితలైవికే చెల్లింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/