జయప్రద తెలుగు మహిళ. ముందు తెలుగులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. రాజకీయాల్లోనూ ఫస్ట్ ప్రయారిటీ నార్త్ ఇండియాకే ఇచ్చింది. ఆశ్చర్యకరంగా ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. అక్కడి మహిళగా కొనసాగింది. అమర్ సింగ్ అండతో సమాజ్ వాదీ పార్టీలో చక్రం తిప్పింది పదవులూ అలంకరించింది. కానీ ఇప్పుడు ఆమె సమాజ్ వాదీ పార్టీ పొడే గిట్టనట్లు మాట్లాడుతోంది. మధ్యలో రాజకీయాలకు కొంత విరామం ప్రకటించిన జయప్రద ఇప్పుడు పునరాగమనానికి రెడీ అవుతోంది. ఐతే ఆమె ఈసారి సమాజ్ వాదీ పార్టీలో మాత్రం చేరేది లేదని స్పష్టం చేసేసింది.
కొన్నేళ్ల కిందట అమర్ సింగ్ ను సమాజ్ వాదీ పార్టీ నుంచి గెంటేసినపుడు జయప్రద కూడా ఆ పార్టీ నుంచి బయటికి వచ్చింది. ఐతే అమర్ తిరిగి పార్టీలోకి వెళ్లాడు. జయప్రద మాత్రం పార్టీ వ్యవహారాల్లో పాల్గొన్నది లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న జయప్రద.. ఏ పార్టీలోకి వెళ్తుందన్నది ఆసక్తికరం. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆమెను ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలొచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జయప్రదకు ఆహ్వానం వెళ్లిందట. ఐతే ఆమె ఆ రెండు పార్టీల్లోనూ చేరలేదు. సమాజ్ వాదీ పార్టీలో ఈ మధ్య ములాయం సహా సీనియర్లందరికీ అఖిలేష్ చెక్ పెట్టాడు. అమర్ సింగ్ కూడా ప్రస్తుతం ఆ పార్టీలో ఇబ్బంది పడుతున్నాడు. నామమాత్రంగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే జయప్రద ఆ పార్టీకి దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. యూపీ ఎన్నికల ఫలితాల అనంతరం జయప్రద ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోవచ్చు. అంచనాలకు తగ్గట్లే భాజపా మంచి ఫలితాలు సాధిస్తే ఆటోమేటిగ్గా ఆమె ఆ పార్టీలోనే చేరుతుందని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/