జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసిన నిజనిర్ధారణ కమిటీలో లుకలుకలు మొదలైనట్లు వినిపిస్తోంది. రాష్ర్ట ప్రభుత్వం విషయంలో ఎలాంటి వైఖరి చూపాలి అన్న విషయంలో సభ్యులు రెండుగా చీలిపోయారని తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబుతో మొహమాటాలు ఉన్న జయప్రకాశ్ నారాయణ్ వంటివారు రాష్ట్ర ప్రభుత్వం పట్ల కొంత సానుకూలంగా ఉంటున్నారని... దాన్ని మిగతావారు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ కమిటీలో ఏకాభిప్రాయం రావడంలేదని తెలుస్తోంది.
కమిటీ తొలి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేపీ… కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులు ఇవ్వడం వరకే… వాటిని ఎలా ఖర్చు పెడుతారన్నది రాష్ట్ర ప్రభుత్వ హక్కు అన్నారు. కేంద్రం లెక్కలు అడగడాన్ని జేఎఫ్ సీ ఖండిస్తోందన్నారు. దీంతో జేఎఫ్ సీ తరుఫున జేపీ ఎలా ఖండిస్తారని మరికొందరు సభ్యులు అభ్యంతరం లేవనెత్తినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా చంద్రబాబు వద్ద సీఎస్ గా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు జేపీ వ్యాఖ్యలను అంగీకరించలేదట. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందేనన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ... కేంద్రం ఇచ్చే నిధులను నిర్ధిష్ట కార్యక్రమాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని.. వాటికి ఖర్చు పెట్టారో లేదో యూటీసీలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారట. ఆయన వాదనకు మరికొందరు సమర్ధించడంతో జేపీ అప్పటికి సైలైంటయిపోయినా లోలోన రగులుతున్నారని టాక్.