ఏపీ స‌ర్కారుపై మండిప‌డ్డ జేపీ

Update: 2016-10-30 09:47 GMT
32 లక్షల మంది లబ్దిదారులు - రూ.7623 కోట్ల డిపాజిట్లు...ఎనిమిది రాష్ట్రాల్లో లావాదేవీలు..ఇది అగ్రిగోల్డ్ గురించి సింపుల్ ప‌రిచ‌యం. దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడంలో తీవ్ర జాప్యం ఎదురవుతుండటంపై  లోక్‌ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణ మండిప‌డ్డారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దేశంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన ప్రత్యేక బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ బృందంలో పోలీసు - రెవెన్యూ - అకౌంట్స్‌ వంటి అన్ని విభాగాల అధికారులు సభ్యులుగా ఉండాలని సూచించారు. ఇప్పటివ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు బాధితుల్లో భ‌రోసా క‌ల్పించే విధంగా లేవ‌ని జేపీ త‌ప్పుప‌ట్టారు.

ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ దేశ‌వ్యాప్తంగా న‌ష్ట‌పోయిన వారిలో ఒక్క ఏపీలోలోనే 19.43 లక్షల మంది ఖాతాదారులు రూ.3,900 కోట్ల డిపాజిట్‌ లు చెల్లించి దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నార‌ని చెప్పారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి సంబంధించిన 87 కంపెనీల డైరెక్టర్‌ లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని - ఆర్థిక నేరాల నియంత్రణకు 1996లోనే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చట్టం చేసిందని చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకూ లోక్‌ సత్తా పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ కు చెందిన హాయ్ ల్యాండ్‌ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా ఇంకా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ఎలా పెత్తనం చేస్తుందని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా విజయవాడ నుంచి వెలగపూడి వరకు పాదయాత్ర చేయనున్నామని వివరించారు. ఈ సమావేశంలో సీపీఐ - సీపీఎం - వైసీపీ - కాంగ్రెస్‌ - బీజేపీ - వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనంత‌రం జేపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య ప్రజలకు పౌర సేవలు సక్రమంగా అందటం లేదని, ఇందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.సామాన్య ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి పెరిగిపోయిందని జేపీ మండిప‌డ్డారు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న సమస్యలకు అంతంత మాత్రమే పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో తాను జాతీయ స్థాయిలో పౌర సేవల నమూనా చట్టం, విధి విధానాలను తయారు చేసి కేంద్రానికి నివేదికలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్య ప్రజలకు పౌర సేవలు అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని జేపీ  అన్నారు. తద్వారా పేద - బడుగు - బలహీన వర్గాల ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మావోయిస్టులను ఉద్యమకారులనే పేరుతో కాల్చిచంపే హక్కు రాజ్యానికి లేదని జేపీ పేర్కొన్నారు. ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్‌పై సమగ్ర విచారణ చేయించాలని, రాజ్యహింస రాజ్యాంగ విరుద్ధమన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News