ఊహకు అందని పరిణామాలు కొన్నిసార్లు చోటు చేసుకుంటాయి. తాజా పరిణామం అలాంటిదే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఆయన ఎక్కడోడు? ఆయనకు తెలంగాణకు సంబంధం ఏమిటి? అంటూ ఆయన ఆంధ్రామూలాల్ని వెలికి తీసి మరి తిట్టేసిన ప్రముఖుడే.. తాజాగా గులాబీ బాస్ నిర్ణయాన్ని సమర్థించిన సిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ.. కేసీఆర్ చేత తిట్లు తిన్న ఒక ప్రముఖుడు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆయన వ్యవహరిస్తున్న తీరును సమర్థించటం ఆసక్తికరంగా మారింది.
కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ విపక్షాలన్ని సమర్థిస్తున్న వేళ.. కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. సమ్మె చేస్తున్న 48 వేల మంది ఉద్యోగులు సెల్ప్ డిస్మిస్ అయ్యారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కలత చెంది ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణత్యాగం చేసిన వైనంతో.. కేసీఆర్ సర్కారు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
ఇలా.. చుట్టూ ప్రతికూల వాతావరణం చోటు చేసుకున్న వేళ.. సమ్మెను వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ స్టాండ్ ను సమర్థించారు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మేధావిగా.. ఏ విషయంపైనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టేలా వ్యాఖ్యలు చేసే అలవాటున్న జేపీ.. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతాయని తప్పు పట్టారు.
జేపీ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆయన మూలాల్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. అయితే.. తన మూలాల్ని ప్రశ్నిస్తూ గులాబీ బాస్ చేసిన విమర్శలపై జేపీ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మాత్రం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల నిర్ణయాన్ని ఒక ఇంటర్వ్యూలో జేపీ తప్పు పట్టారు. ఆర్టీసీ సమ్మె సమంజసం కాదని.. ఏపీలో జగన్ సర్కారు తీసుకున్న ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన నిర్ణయం ఏ మాత్రం సరికాదన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయటం తిరోగమన చర్యగా ఆయన అభివర్ణించారు.
ప్రజల కోసం పని చేయాల్సిన కార్మికులు.. ప్రభుత్వాన్ని శాసించే స్థితిలోకి వెళ్లటం ఏ మాత్రం సరికాదన్న జేపీ.. విలీనం ఏ మాత్రం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగే కన్నా..నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేస్తే బాగుండేదన్నారు. ప్రైవేటుతో ఆర్టీసీ పోటీ పడాలని.. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఓట్ల కోసం ఆర్టీసీ విలీనం చేయాలని నిర్ణయించటం ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు.
ఆర్టీసీలో పోటీతత్త్వం పెంచాలన్న ఆయన.. సంస్థ మనుగడ కోసం ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలన్నారు. విలీనం మాత్రం సరికాదన్నారు. కార్మికులు ప్రభుత్వానికి కేవలం సలహాలు.. సూచనలు మాత్రమే చేయాలన్నారు. వ్యాపార పరమైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సరికాదని స్పష్టం చేశారు. తనను తప్పు పట్టిన కేసీఆర్ ను అనూహ్యంగా జేపీ సమర్థించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ అయ్యింది.