జ‌య‌రాం ఇంత ఈజీగా చనిపోతాడనుకోలేదు!

Update: 2019-02-13 17:30 GMT
వ్యాపార‌వేత్త చిగురుపాటి జ‌య‌రాం హ‌త్య ఉదంతంలో సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌ రెడ్డిని పోలీసు కస్టడీకి కోర్టు అనుమించడంతో... మూడు రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ తొలిరోజు జూబ్లీహిల్స్ పోలీసులు రాకేష్‌ రెడ్డి ప్రశ్నించారు. జయరాం హత్యకు దారితీసిన విషయాలపై రాకేష్‌ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించగా ఆయ‌న సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

జ‌య‌రాం హ‌త్య‌కేసులో నిందితుల‌ను పీటీ వారెంట్ పై తెలంగాణకు తరలించిన నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు పర్మిషన్ ఇచ్చింది. రెండు వారాల పాటూ కస్టడీకి ఇవ్వాలని జుబ్లిహిల్స్ పోలీసులు  పిటీషన్ దాఖలు చేయగా.. మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలిచ్చింది కోర్టు. దీంతో...ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. జయరాం హత్యకేసును వివిధ కోణాల్లో విచారణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న పోలీసులు ఇందుకోసం నిందితులను అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

తనకు జయరాంను చంపాలన్న ఉద్దేశం లేదని పోలీసుల విచారణలో రాకేష్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదు...తాను కొట్టిన దెబ్బలకు అనారోగ్యంతో ఉన్న జయరాం చనిపోయాడని రాకేష్ అంగీక‌రించాడు. డబ్బుల కోసమే అమ్మాయి పేరుతో ట్రాప్ చేసి జయరాంను తన ఇంటికి పిలిపించానని.. తాను కొట్టడంతో జయరాం మృతిచెందాడని చెప్పాడు. ఇక జనవరి 31వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు కారులోనే జయరాం బీడీ పెట్టుకుని హైదరాబాద్‌ లో తిరిగానని పోలీసుల విచారణలో బయటపెట్టాడు రాకేష్‌రెడ్డి. మధ్యాహ్నం 4  గంటలకు జయరాం డెడ్ బాడీతో నల్లకుంట పోలీసుస్టేషన్‌ కు కూడా వెళ్లాలనన్నారు. హత్య జరిగిన రోజు సీఐ శ్రీనివాస్ కు 13 సార్లు ఫోన్ చేశానని.. హత్య జరిగిన తర్వాత ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్‌ లో మాట్లాడినట్టు పోలీసులు వెల్లడించారు. వారి సూచనలతోనే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని అనుకున్నానని రాకేష్‌ రెడ్డి పోలీసులకు తెలిపిన‌ట్లు స‌మాచారం.

Tags:    

Similar News