సీనియర్ టాలీవుడ్ నటి జయసుధ తాజా ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కేసీఆర్ ను అభినందనలతో ముంచెత్తారు. ఈ విజయం గాలివాటంగా.. సులభంగా వచ్చిన విజయం కాదని జయసుధ వ్యాఖ్యానించారు. నటీమణులు - కాంగ్రెస్ నేతలు ఖుష్బూ - నగ్మా లాంటి నేతలు కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేశారని.. హేమాహేమీలు ప్రచారం చేసినా కాంగ్రెస్ ఓడిపోయిందని ఆమె తెలిపారు. తెలంగాణ పోరాటానికి - సెంటిమెంట్ కు ప్రజలు పట్టం కట్టారని జయసుధ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రచారంలో జనం పోటెత్తారని.. నటులు - సెలబ్రెటీలను చూడడానికి వచ్చారని.. కానీ అంతిమంగా ఓటర్లు తమ బాగు కోసం పరితపించే పార్టీకే విజయం కట్టబెట్టారని జయసుధ పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చినా వారి చరిష్మా పనిచేయలేదని స్పష్టం చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ ను కలిశానని.. అతనో సింహం.. తెలంగాణ ఏర్పాటుకు - ఉద్యమాన్ని తీరం చేర్చిన గొప్ప నేత అని జయసుధ పేర్కొన్నారు.
ఇక విజయశాంతి గురించి కూడా జయసుధ చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి పాలుపంచుకున్నారని.. సెంటిమెంట్ ను రాజేశారని.. కానీ వ్యక్తిగత లోపాల కారణంగానే ఆమె ఎదగలేకపోతున్నారని’ జయసుధ స్పష్టం చేశారు.