ఇంట్లో ఏదైనా చక్కటి కార్యక్రమం జరుగుతుంటే ఏం చేస్తాం? మొదట రక్త సంబంధీకుల్ని.. బంధువుల్ని.. స్నేహితుల్ని.. హితుల్ని పిలుస్తుంటారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ నేత జయసుధ.. తన కుమారుడి బస్తీ చిత్ర ఆడియో ఫంక్షన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పిలిపించి కార్యక్రమాన్ని ముగించారు.
దీంతో.. జయసుద టీఆర్‌ఎస్‌లోకి వెళతారన్న వాదన బలంగా వినిపించింది. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉండటం.. పార్టీ కార్యకలాపాల్ని పట్టించుకోకుండా ఉన్న నేపథ్యంలో.. మాజీగా ఉన్న ఆమె అధికారపక్షం వైపుకు వెళ్లిపోవటం పెద్ద విషయం కాదన్న భావన నెలకొంది.
అయితే.. దీనికి సంబంధించి సాగుతున్న రచ్చకు పుల్‌స్టాప్ పెట్టాలని జయసుధ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఆమె మంగళవారం ఆమె టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. తనపై సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. తాను పార్టీలో కొనసాగుతానని.. తాను కాంగ్రెస్ పార్టీకి వీర విధేయురాలినని చెప్పినట్లు తెలుస్తుంది. తాను పార్టీ మారాలని అనుకోవటం లేదని.. అలాంటి ఉద్దేశ్యం లేదని సమాచారం.
కొడుకు సినిమా వ్యవహారాలతో బిజీగా ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదని.. ఇకపై తాను పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గనటానికి టైం సరిపోలేదు సరే.. మరి.. ఫంక్షన్‌కు కాంగ్రెస్ నేతల్ని ఎందుకు పిలవనట్లు? దానికి కూడా టైం చిక్కలేదేమో..?