రాజకీయాలకు సినిమాలకు మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమా రంగానికి చెందిన పలువురు రాజకీయాల్లోయాక్టివ్ గా ఉండటం తెలిసిందే. అధికార బదిలీ జరిగిన ప్రతిసారీ కొందరు సినీ ప్రముఖులకు అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. తాజాగా అలాంటిదే సీనియర్ నటి జయసుధ విషయంలో జరగనుందా? అంటే అవునని చెబుతున్నారు.
ఏపీలో మారిన ప్రభుత్వం నేపథ్యంలో జయసుధకు కీలక పదవీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వారిలో మోహన్ బాబు.. జయసుధ.. జీవిత.. రాజశేఖర్.. అలీ.. పోసాని.. పృథ్వీ తో సహా పలువురు సీనియర్ నటులు ఉన్నారు. వారంతా జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించిన వారే.
అలాంటి వారికి జగన్ తాజాగా సీఎం పదవిని చేపట్టటం కొత్త ఆశలకు తెర తీస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన పదవికి టీడీపీకి చెందిన అంబికా కృష్ణ రిజైన్ చేశారు. దీంతో.. ఎఫ్ డీసీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఛైర్మన్ పదవిని జయసుధకు ఇవ్వటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. సీనియర్ నటి అన్న ట్యాగ్ తో పాటు.. ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్న జయసుధకు ఆ పదవి సరిగ్గా సరిపోతుందంటున్నారు. మరి.. జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.