జేసీ ఇంటర్నెట్లో ఎంత వైరల్ తెలుసా?

Update: 2017-06-18 08:27 GMT
విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి హల్ చల్ చేయడం.. ఆయనపై విమానయాన సంస్థలు కొన్ని నిషేధం విధించడం తెలిసిందే. అయితే... జేసీ వ్యవహార శైలికి సంబంధించిన ఆ వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయిందట. కేవలం అరగంటలో ఆ వీడియోను 12 లక్షల మంది చూశారట. ఇంతకీ ఈ సంగతి ఎవరు చెప్పారో తెలుసా.. టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబునాయుడే స్వయంగా ఈ మాటను ఓ సమావేశంలో చెప్పారు.
    
అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతల తీరుపై  అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఒక్కో ఇటుకను పేరుస్తూ గోడ కడుతుంటే వారంతా బుల్‌ డోజర్‌ తో దాన్ని కూల్చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధుల తీరు తెన్నులను, వ్యవహారశైలిని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
    
అయితే... జేసీ దివాకర్‌ రెడ్డి ఎయిర్‌ పోర్టులో వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్రంలో చెడ్డపేరు రాలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.  జేసీ వ్యవహారశైలి అంతేలే అని రాష్ట్ర ప్రజలు లైట్ గానే తీసకున్నారని... ఆయన ఎప్పుడూ అలానే ఉంటారని అందరికీ తెలుసని అన్నారు.  కానీ జాతీయ స్థాయిలో మాత్రం బాగా చెడ్డపేరు వచ్చిందని బాబు వ్యాఖ్యానించారు. జేసీ ఎయిర్‌ పోర్టులో వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోను అరగంటలోనే 12 లక్షల మంది సోషల్ మీడియాలో వీక్షించారని చంద్రబాబు చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News