బాబు రాజ్యంలో కమ్మవారికి అన్యాయం!

Update: 2019-12-12 10:57 GMT
రాంగోపాల్ వర్మ ఏ ముహూర్తాన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్ పెట్టాడో కానీ ఏ సినిమాకు రానంత అద్భుతమైన స్పందన దీనికి వచ్చింది. దాని రిలీజ్ సంగతి పక్కనపెడితే ఆ టైటిల్ కేంద్రంగా పడుతున్న మీమ్స్, సెటైర్లు అయితే లెక్కలేవు.

తాజాగా ఈ టైటిల్ తోనూ మన రెడ్డప్ప చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ సీనియర్ నాయకుడు, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  వివాదాస్పద కామెంట్స్ కు పెట్టింది పేరు. తాజాగా సంచలన కామెంట్స్ తో హోరెత్తించాడు. ‘‘బాబు రాజ్యంలో కమ్మవారికి అన్యాయం’’ జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్ల కమ్మ సమజం తీవ్ర అన్యాయానికి గురైందని ఆరోపించారు. చంద్రబాబుకు కమ్మ వారిని ఆదుకునే విషయంలో అస్సలు మనసులేదని జేసీ ఆరోపించారు.

 ఏపీలో వైఎస్ జగన్ పాలన గురించి కూడా జేసీ స్పందించారు. ఏపీలో ‘రెడ్ల రాజ్యం’ పాలన జరుగుతోందని.. రెడ్డి రాజ్యంలో కక్ష రాజ్యం’ అని పిలవాలని జేసీ ఆరోపించారు. అయితే సీఎం జగన్ రెడ్డి కావడంతో ఆయన పాలనలో రెడ్లకు నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ భాగం దక్కుతున్నాయని.. ఇదే తెలివి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.

అయితే జగన్ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పుకొచ్చాడు. రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటనను జేసీ మనస్ఫూర్తిగా అభినందించారు. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిన జగన్ కు వందనాలు అంటూ కొనియాడారు. .
Tags:    

Similar News