ప్రధాని మోడీ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారా? తనను అడిగేనాధుడు లేరు కదాని.. ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్నారా... ? ఈ మాటలు కాంగ్రెస్ నేతలు - ఇతర విపక్షాల నేతలు అంటే మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్డీయేలో మాత్రమే కాదు.. సాక్షాత్తూ ప్రభుత్వంలో కూడా భాగస్వాములు అయిన తెదేపా ఎంపీలు అంటేనే ఆలోచించాలి. దేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. తాజాగా మోడీ మీద మరోసారి విరుచుకుపడ్డారు. సాధారణంగా ఏది పడితే అది విమర్శలు చేస్తూ ఉంటారు గనుక.. మోడీ మాటలకు పెద్దగా విలువ ఉండదని అనుకోవచ్చు.. కానీ .. తెలుగుదేశం ఎంపీలు అందరూ కూడా ఏదో కూడబలుక్కున్నట్లుగా కేంద్రానికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడం అనేది.. రాజకీయంగా ఏదో సంకేతాలు పంపుతున్నట్లుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
రైల్వే బడ్జెట్ కు సంబంధించి.. మీ రాష్ట్రం నుంచి ఏమైనా ప్రతిపాదనలు ఉంటే పంపండి.. అని కేంద్రంనుంచి ఓ పురమాయింపు వచ్చింది. దానికి తగినట్లుగా ఇక్కడి రైల్వేఅధికారులు ఆంధ్ర ఎంపీలతో ఓ సమావేశం నిర్వహించారు. మూడు నెలల ముందు అడగాల్సిన ప్రతిపాదనల గురించి అడిగేది ఇప్పుడా..? ఒకవైపు బడ్జెట్ కేటాయింపులు కూడా తయారైపోతున్ సమయంలో.. ఇప్పుడు మమ్మల్ని అడగడం కూడా అవమానమే అనే రేంజిలో తెలుగుదేశం ఎంపీలు విరుచుకుపడ్డారు. ఇదంతా ఏదో భోజనాలకు పిలిచినట్లుగా ఉన్నది తప్ప.. ఎంపీల అభిప్రాయాలు తెలుసుకుని ఆ మేరకు బడ్జెట్ కేటాయించడం కోసం నిర్వహిస్తున్నట్లుగా లేదని కూడా వారు కత్తులు దూయడం గమనార్హం.
ఇంత స్వల్ప వ్యవధిలో ఎంపీల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నంత మాత్రాన బడ్జెట్ లో వాటికి దక్కే మన్నన ఎంతమాత్రమూ ఉండదు. మళ్లీ.. తమను సంప్రదించకుండానే బడ్జెట్ తయారైందని, కేటాయింపుల్లో వివక్ష ఉన్నదనే అపప్రధ రాకుండా ఉండడానికి కేంద్రం మొక్కుబడిగా మాత్రమే.. ఈ ప్రతిపాదనల సేకరణ తంతు నిర్వహిస్తూ ఉన్నది అనే దాదాపుగా అందరు తెదేపా ఎంపీల అభిప్రాయంగా ఉంది. అయితే.. మోడీతో చంద్రబాబు భేటీ తర్వాత.. చాలా విషయాల్లో క్లారిటీ వస్తుందని అంటున్న కేశినేని నాని మాటల్లో అంతరార్థం ఏమైనా ఉన్నదేమో తెలియాల్సి ఉంది. ప్రధానిలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని వ్యాఖ్యానించిన జేసీ... ఇలాంటి మీటింగులో ప్రతిపాదనలు ఇవ్వడం కంటె.. కోడిపందేలు చూడడం బెటరంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు.