స్వపక్ష -, విపక్షం అన్న తేడా లేకుండా నిర్మొహమాటంగా మాట్లాడడం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నైజం. ఇప్పటికే చాలాసార్లు తమ పార్టీ నేతలపై....కొన్ని సందర్భాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం జేసీకి మాత్రమే సాధ్యం. చెప్పదలుచుకున్న విషయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేయడం జేసీ మేనరిజం. ఈ క్రమంలోనే జేసీ....కొన్ని సార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో కూడా నిలుస్తుంటారు. అందుకే జేసీ చర్యలు ఊహాతీతం అని ...రాజకీయ వర్గాల్లో ఓ నానుడి ఉంది. అందుకు తగ్గట్లే తాజాగా - జేసీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. శుక్రవారం జరగబోతోన్న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు తాను హాజరు కాబోనని జేసీ దివాకర్ రెడ్డి తెగేసి చెప్పినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఎంపీ సుజనా చౌదరి వైఖరి వల్లే జేసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు ముందే టీడీపీకి జేసీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఓటింగ్ లో పాల్గొనే టీడీపీ ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న సుజనా చౌదరి వైఖరిపై జేసీ గుర్రుగా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. తనను పట్టించుకోవడం లేదంటూ జేసీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు అవిశ్వాసానికి హాజరయ్యేది లేదని తెగేసి చెప్పారు. అవిశ్వాసంపై వివిధ పార్టీల మద్దతు కోరనున్న టీడీపీ ఎంపీల బృందంలో జేసీ కూడా ఉన్నారు. అయితే, ఆ బృందానికి నాయకత్వం వహిస్తోన్న జేసీ....ఒంటెత్తు పోకడలు జేసీకి నచ్చడం లేదని...అందుకే ఆగ్రహానికి గురైన జేసీ.... అవిశ్వాస తీర్మానానికి డుమ్మా కొట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, జేసీని ఎలాగోలా బుజ్జగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కార్ పై కాంగ్రెస్ - తెలుగుదేశం - నేషనలిస్ట్ పార్టీలు బుధవారం లోక్‍సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.