తెలంగాణా రాష్ట్ర సమితిని కాస్తా భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. అంటే కేసీయార్ లో విశాల భావాలు వచ్చినట్లే. జాతీయ పార్టీ అధినేతగా ఆయన ముందుకు వస్తున్నారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో పాత సంకుచిత విధానాలను వదిలేసినట్లే కదా అని అంటున్నారు. ఆంధ్రా వాళ్ల మీద ఇప్పటికే బీయారెస్ నేతలు ప్రేమ చూపిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం పూర్తి చేయలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు అసలు పట్టించుకోలేదు అని కేంద్రం మీద కేసీయార్ దాడి చేస్తున్నారు.
సాటి రాష్ట్రం ఏపీ అన్ని విధాలుగా అన్యాయం అయిపోయింది అని కూడా బాధపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కేసీయార్ ముందు ఒక ప్రతిపాదన పెడుతున్నారు రాజకీయాల్లో తలపండిన నేత మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. రాయలసీమను తెలంగాణాలో కలిపేసుకోమని ఆయన సూచిస్తున్నారు. రాయల తెలంగాణా గా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అలా కనుక చేస్తే రెండు ప్రాంతాలకు మేలు జరుగుతుందని ఆయన అంటున్నారు. రాయలసీమను కలుపుకోవాల్సిన అవసరం కేసీయార్ కి ఉందని అన్నారు. రాష్ట్రాలను విడగొట్టడం, కొత్తగా ఏర్పాటు చేయడం కష్టమైతే కావచ్చు కానీ కలపడం డెడ్ ఈజీ అని ఈ వృద్ధ నేత సెలవిస్తున్నారు.
పైగా రాయలసీమ సమస్యలు తీరాలంటే సాగునీటికి సంబంధించిన కష్టాలు తీరాలన్నా కూడా తెలంగాణాలో కలిపేస్తేనే సాధ్యపడుతుందని ఆయన అంటున్నారు. ఈ విషయంలో తాను అనేక పార్టీలను కలసి అభిప్రాయాలను సేకరించానని అందరూ తన ప్రతిపాధనకు సరేనని చెబుతున్నారని జేసీ దివాకరరెడ్డి చెప్పడం విశేషం.
రాయల తెలంగాణాకు ఎవరికీ అభ్యంతరం లేదని, అసలు ఉండాల్సిన పరిస్థితి లేదని ఆయన ఘంటాపధంగా చెబుతున్నారు. తన ప్రతిపాదనకు అందరి అభిప్రాయాలను సమీకరిస్తున్నానని అంతా ఆశాజనకంగానే ఉంది అని అంటున్నారు.
తెలంగాణా ఎన్నికల తరువాత మొత్తం నేతలను అందరికీ కలుస్తాను అని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే తమ వాదన పట్ల అటూ ఇటూ అంగీకరం ఉందని అంటున్నారు. జేసీ ఈ పాట పాడుతోంది ఇదే తొలిసారి కాదు ఆయన తొమ్మిదేళ్ల క్రితం విభజన అనివార్యం అయిన సందర్భంలో కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ ఈ మాటే చెప్పారు. రాయల తెలంగాణాని పరిశీలించాలని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరారు
అయితే నాడు ఉద్యమ వేడిలో టీయారెస్ ఉంది. అలా చాలా మంది తెలంగాణా నాయకులు దీనిని తోసిపుచ్చారు. అయితే ఇపుడు టీయారెస్ లో తెలంగాణాను తీసేసి కేసీయార్ జాతీయ భావాలతో సరికొత్తగా పార్టీ విధానాన్ని మార్పు చేశారు. ఆయన ఏపీకి వస్తున్నారు. రాజకీయం చేస్తున్నారు మరి తెలంగాణాలో ఎవరు పోటీ చేసినా ఏలినా తప్పు లేనపుడు తెలంగాణాలో రాయలసీమ నాలుగు జిల్లాలను కలిపితే తప్పేముంది అన్న మాట వస్తోంది.
ఇక కేసీయార్ కి కావాల్సింది ఎంపీ సీట్లు ఎక్కువగా. ఆ సంఖ్య పెరగాలీ అంటే రాయలసీమను కలుపుకుంటే పెద్ద రాష్ట్రంగా తెలంగాణా ఉంటుంది. అలాగే కేసీయార్ జాతీయ రాజకీయం వెలుగుతుంది. బీయారెస్ అన్న పేరు పెట్టినందుకు సార్ధకత ఏర్పడుతుంది. నిజంగా కేసీయార్ సంకుచిత భావాలు వీడిన వారు అయితే ఇది సాధ్యమే అని అంతా అంటున్నారు. రాయలసీమ ఏపీలోని జిల్లాల కంటే కూడా తెలంగాణాతోనే బాగా కనెక్ట్ అయి ఉన్నాయని అంటున్నారు. సాగు నీటి వివాదాలు కూడా ఈ విలీనం వల్ల సమసిపోతాయని అంటున్నారు. మరి ఆ ప్రతిపాదనలు బీయారెస్ వైపు నుంచి సానుకూలత వస్తుందా.
ఇక్కడే బీయారెస్ కి ఒక పరీక్ష అని కూడా చెప్పాలి. రాయలసీమ జిల్లాలు మాతో కలుపుకోమని ఆయన అంటే ఏపీలో ఆయన రాజకీయానికి పెద్ద బ్రేక్ పడుతుంది. మరీ ముఖ్యంగా సీమ మీద పెట్టుకున్న రాజకీయ ఆశలు ఏమీ కాకుండా పోతాయి. పైగా జాతీయ పార్టీ అంటూ పెట్టినా కూడా ఇంకా తెలంగాణావాదమేనా అన్న విమర్శలు వస్తాయి. అలాగని కలుపుకోవాలని చూస్తే ఏపీ నుంచి మరింత వ్యతిరేకత వస్తుంది. అదే సమయంలో తెలంగాణాలో కొత్త ప్రాంతీయ వాదం పురి విప్పుతుంది. ఇదంతా చూస్తూ ఉంటే జేసీ చేసిన ప్రతిపాదన బీయారెస్ మీద అస్త్రంగా మారుతుందా అన్న చర్చ వస్తోంది.