టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. అలాగే టీఆర్ ఎస్ ఎమ్మెల్యే నరేందర్ కు కూడా పాజిటివ్ తేలింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం కడప జైల్లో ఉన్నారు. ఇటీవల కడప సెంట్రల్ జైల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఖైదీ లందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో జైల్లో ఉండే వారిలో 317 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 14 మంది జైలు అధికారులు ఉండగా మిగిలిన 303 మంది ఖైదీలే. కరోనా సోకినవారిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. బీఎస్ -3 వాహనాలను బీఎస్ -4 వాహనాలుగా మార్చి విక్రయించారన్న కేసులో ఇటీవల జేసీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జేసీతో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా అరెస్టయ్యాడు.
ఈ కేసులో వీరికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో కడప జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన తాడిపత్రి చేరుకుని వందలాది మంది అనుచరులతో ర్యాలీగా ఇంటికి చేరుకున్నారు. ర్యాలీ నిర్వహించే సమయంలో ఓ దళిత పోలీస్ అధికారిని దూషించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒక రోజు పోలీసు కస్టడీ ముగియడంతో రెండు రోజుల కిందట కడప జైలుకు తరలించారు. అక్కడ ఖైదీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా..పరీక్షల్లో జేసీకి పాజిటివ్ తేలింది. ప్రస్తుతం ఆయనకు జైల్లోనే ఒక ప్రత్యేక గదిని కేటాయించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో సన్నిహితంగా మెలిగారు. ఆ సమయంలో ఆయన కరోనా బారిన పడి ఉంటారని భావిస్తున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆయన వెంట తిరిగిన నాయకులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.