సిబిఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేనని అన్నారు. అదేంటి అనుకుంటున్నారా? నిజమే! తాజాగా ఆయన శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. ఇక్కడ ప్రభుత్వం నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రసంశల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఇతర రాష్ట్రాలు కూడా కొనసాగిస్తున్నాయని.. చాలా మందికి తెలియదని వ్యాఖ్యానించారు.
అదేసమయంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1 సరైనదేనని జేడీ చెప్పుకొచ్చారు. రోడ్ల మీద సభలు, రోడ్‌షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్న జీఓ మంచిదన్నారు. ఇటీవల జరిగిన ఘటనల దృష్ట్యా ఈ జీఓను అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి విషయాన్నీ రాజకీయాలు చేయాలని అనుకుంటున్న వారికి తాను ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ జీవోను హైకోర్టు కొట్టివేయలేదని.. కేవలం సస్పెండ్ మాత్రమే చేసిందని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని సర్టిఫికేట్ ఇచ్చారు. 200 పడకల కిడ్నీ ఆస్పత్రి రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టుగా భావిస్తున్నానని జేడీ చెప్పారు. కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం గొప్ప విషయమని కొనియాడారు. అదేవిధంగా ఉద్దానంలో ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
అయితే.. జేడీ రాజకీయాల్లో ఉండడంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారా? అనే చర్చ వస్తోంది. కానీ, ఆయనే కొన్ని రోజుల కిందట.. తాను , తన కుమార్తె కూడా.. ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్టు చెప్పారు. మరి ఇప్పుడు అనూహ్యంగా పనిగట్టుకుని ఆయన పలాస వెళ్లి ప్రభుత్వాన్ని ఎందుకు కొనియాడారు? అనేది ప్రశ్న. అంతేకాదు.. రెండు మూడు రోజుల కిందట జనసేన అధినేత పవన్ ఇక్కడ పర్యటించి.. శ్రీకాకుళం వెనుకబడిందని.. ప్రభుత్వం ఏమీ చేయడం లేదని .. చెప్పిన రెండు రోజులకే .. ఇక్కడి ప్రాంతాన్ని ఆయన సందర్శించడం.. ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇవ్వడం.. వంటివి రాజకీయంగా చర్చకు వస్తున్నాయి.