పార్టీ మార్పుపై స్పందించిన జేడీ

Update: 2020-01-13 08:21 GMT
ఏపీ రాజకీయ యవనికపై దూసుకొచ్చిన నాయకుల్లో జేడీ లక్ష్మీనారాయణ ఒకరు.. ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగుదామని ఆలోచించారు. కానీ అంత శక్తిసామర్థ్యాలు లేకపోవడంతో టీడీపీలో చేరిపోతున్నారన్న ప్రచారం సాగింది.  కానీ చివరి నిమిషంలో జనసేనలో చేరారు. విశాఖ ఎంపీగా పోటీచేసి 2 లక్షలకు పైగా ఓట్లు సాధించారు.

జనసేనాని పవన్ కు, ఆ పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మధ్య చాలా దూరం పెరిగిపోయినట్టు ఇటీవల వార్తలొచ్చాయి. పవన్ ప్రకటించిన పార్టీ కమిటీలతో తేటతెల్లమైంది. జనసేన ప్రకటించిన రెండు కీలక కమిటీల్లోనూ లక్ష్మీనారాయణకు చోటు దక్కలేదు.  జనసేన తరుఫున విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన జేడీ లక్ష్మీనారాయణను పవన్ దూరం పెట్టారా? లేక ఆయనే దూరంగా జరిగారా అన్న సస్సెన్స్ ఇప్పుడు అందరిని పట్టిపీడిస్తోంది.

అయితే జేడీ ఓడిపోయాక పార్టీలో చురుకుగా లేరన్న ప్రచారం సాగింది. ఆయన సొంత ఇమేజ్ తో బయట సామాజిక సేవా కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు హాజరు అవుతూ జనసేన పార్టీ నిర్వహించే ఆందోళనలు, నిరసనలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయని వార్తలు వచ్చాయి.  అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేడీ లక్ష్మీనారాయణ తనపై వస్తున్న ప్రచారాలకు తెరదించారు. పార్టీ మార్పుపై స్పష్టతనిచ్చారు.

జేడీ లక్ష్మీనారయణ మాట్లాడుతూ.. 'తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అన్ని గాలి వార్తలేనని' కొట్టిపారేశారు.  పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని.. పార్టీ నిర్ణయాల ప్రకారమే నడుచుకుంటానని తెలిపారు. 2020లో కొన్ని వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకున్నానని వాటి కోసం కృషి చేస్తానన్నారు. ఒకవేళ పార్టీ మారే పరిస్థితి వస్తే ఖచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రస్తుతానికి పార్టీ మారబోనని ఆలోచన లేదని స్పష్టతనిచ్చారు.
Tags:    

Similar News