విమానం హైజాక్‌..మోడీకి ట్వీట్‌..హైడ్రామా

Update: 2017-04-28 09:48 GMT
మోడీ స‌ర్‌.. నేను మూడు గంట‌లుగా జెట్ ఎయిర్‌ వేస్ ఫ్లైట్‌ లో ఉన్నాను. విమానాన్ని ఎవ‌రో హైజాక్ చేసిన‌ట్లున్నారు. ప్లీజ్ సాయం చేయండి..`` ఇదీ ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే జెట్ ఎయిర్‌ వేస్ విమానంలో ప్ర‌యాణిస్తున్న నితిన్ అనే ప్ర‌యాణికుడు ప్ర‌ధాని మోడీకి చేసిన ట్వీట్‌. ఇది కాస్తా హైడ్రామాకు కార‌ణ‌మైంది. ఢిల్లీలో వాతావ‌ర‌ణం అనుకూలించ‌క ఆ విమానాన్ని జైపూర్‌ కు మ‌ళ్లించ‌డం గంద‌ర‌గోళానికి తావిచ్చింది. మూడు గంట‌లుగా ఎలాంటి స‌మాచారం లేక‌పోవడంతో ఆ ప్ర‌యాణికుడు.. ఏకంగా మోడీకే హైజాక్ ట్వీట్ చేశారు.

ఈ ప‌రిణామంలో ఉలిక్కి ప‌డిన జెట్ ఎయిర్‌ వేస్ సిబ్బంది.. ``ఢిల్లీలో వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌ మా విమానం 9డ‌బ్ల్యూ 355 ఆల‌స్య‌మైంది అంతే`` అంటూ నితిన్‌ కు ట్వీట్ చేశారు. ఈ విమానంలో 176 మంది ఉన్నారు. అయితే ఈ స‌మాధానంతో నితిన్ సంతృప్తి చెంద‌లేదు. ``ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే మిగ‌తా విమానాల‌కు క్లియ‌రెన్స్ ఇచ్చారు క‌దా.. మీ వాద‌న‌కు ఆధారం ఏదైనా ఉందా?`` అంటూ అత‌ను మ‌రో ట్వీట్ చేశాడు. దీంతో అత‌న్ని జైపూర్ ఎయిర్‌ పోర్ట్‌ లోనే దించి ప్ర‌శ్నించారు భద్ర‌తా సిబ్బంది. ఆ త‌ర్వాత అత‌నిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌న్న విష‌యం మాత్రం చెప్ప‌లేదు. ఢిల్లీలో వాతావ‌ర‌ణం స‌రిగా లేక ఇలాగే రెండు - మూడు విమానాలు జైపూర్‌ కు వ‌చ్చిన‌ట్లు ఆ ఎయిర్‌ పోర్ట్ డైరెక్ట‌ర్ బ‌న్స‌ల్ వెల్ల‌డించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News