మాస్క్ ధర 11.2 కోట్లు .. దీని యజమాని ఎవరంటే ?

Update: 2020-08-10 06:15 GMT
కరోనా వైరస్ పుణ్యమా అని..పేస్ మాస్క్ అనేది ఇప్పుడు మనలో భాగంగా మారిపోయింది. ప్రతి ఒక్కరు కచ్చితంగా పేస్ మాస్క్ ఉపయోగించాల్సిన పరిస్థితి. చాలా దేశాల్లో పేస్ మాస్క్ లేకపోతే భారీగా ఫైన్స్ వస్తున్నారు. అలాగే చాలామంది ఎక్కడ తమకి కరోనా సోకుతుందో ఏమో అని పేస్ మాస్క్ ఉపయోగిస్తున్నారు. దీనితో పది రూపాయల మాస్క్ నుండి N95 మాస్క్ వరకు వాడుతున్నారు. అలాగే  కొందరు  బంగారు, డైమండ్ మాస్క్ లు ఇలా.. వారి వారి స్థాయిలను బట్టి ధరించడం కూడా చూశాం. మాస్క్ ఇప్పుడు కొందరికి స్టేటస్ సింబల్ గా మారిపోయింది.

ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్క్ రూపుదిద్దుకుంటోంది. ఇజ్రాయెల్ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కరోనావైరస్ మాస్క్ ను తయారు చేస్తోంది. టాప్-రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, బంగారం, అతి ఖరీదైన వజ్రాలు పొదిగిన ఈ మాస్క్ ధర 1.5 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ లో  సుమారు 11.2 కోట్లు రూపాయలు. ఇంతకీ ఇంత ఖరీదైన మాస్క్ ఎవరికోసం అంటే అమెరికాలో ఉంటున్న చైనా వ్యాపారవేత్త దీనిని ఆర్డర్ చేశారు. ఇంతకుమించి ఈ మాస్క్ కొనుగోలుదారుని వివరాలను అందించేందుకు జ్యుయల్లరీ సంస్థ  వైవెల్ యజమాని, డిజైనర్ ఐజాక్ లెవీ చెప్పలేదు. జెరూసలేం సమీపంలోని తన కర్మాగారంలో ఒక ఇంటర్వ్యూలో ఈ ఖరీదైన మాస్క్ వివరాలను అందించారు డిజైనర్ ఐజాక్ లెవీ. 18 క్యారెట్ల వైట్ గోల్డ్ తో రూపొందిస్తున్న మాస్క్ చుట్టూ, 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని తెలిపారు. అలాగే కొనుగోలుదారుడి అభ్యర్థన మేరకు ఈ స్పెషల్ మాస్క్ తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఈ మాస్క్ ఈ ఏడాది .. చివరి నాటికి  పూర్తి అవ్వచ్చు అని తెలిపారు. ఇది తయారైన తరువాత  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది గా తమ  మాస్క్ నిలుస్తుందనితెలిపారు. అంతేకాదు కరోనా సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోతూ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నసమయంలో తమకు మంచి అవకాశం లభించిందన్నారు. తమ సిబ్బందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందంటూ  కొనుగోలు దారుడికి కృతజ్ఞతలు తెలిపారు లెవీ.
Tags:    

Similar News