15 ఏళ్ల బాలిక జెండా ఎగ‌రేయ‌టానికి నో!

Update: 2016-08-15 08:11 GMT
స్వాతంత్ర్యం వ‌చ్చి 70 ఏళ్లు అవుతుంది. ఈరోజున స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్నామంటూ చాలానే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నిజం ఉన్నా.. అది పూర్తి నిజం కాదు. ఎందుకంటే.. దేశంలోని కొన్ని చోట్ల జెండా ఎగుర‌వేసేందుకు ఒప్పుకోక‌పోవ‌ట‌మే. ఒక‌దేశంలో ఆ దేశ జాతీయ జెండాను స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున ఎగుర‌వేసేందుకు కూడా ప్ర‌త్యేక అనుమ‌తులు కావాలా? అన్న సందేహం రావొచ్చు. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి మ‌రే దేశంలోనూ ఎదురు కాదేమో.కానీ.. దేశంలో అలాంటి ప‌రిస్థితి ఉంది.

క‌శ్మీర్ రాజ‌ధాని శ్రీన‌గ‌ర్‌ లోని చారిత్ర‌క లాల్ చౌక్‌ లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసి త‌న దేశ‌భ‌క్తిని చాటాల‌ని భావించిన లుధియానాకు చెందిన 15 ఏళ్ల బాలిక జాన్వీ బెహ‌ల్‌ ను జెండా ఎగుర‌వేసేందుకు క‌శ్మీర్ వెళ్లిన ఆమెను భ‌ద్ర‌తాధికారులు ఎయిర్‌ పోర్ట్ లోనే నిలిపివేశారు. ఇంత‌కీ ఈ జాన్వీ ఎవ‌రంటారా? దేశ‌వ్యాప్తంగా త‌న వ్యాఖ్య‌ల‌తో క‌ల‌క‌లం రేపిన జేఎన్‌ యూ విద్యార్థి క‌న్న‌య్య‌పై స‌వాలు చేసి.. త‌న‌తో చ‌ర్చ‌కు రావాలంటూ ఛాలెంజ్ చేసిన జాన్వీ.. ఆగ‌స్టు 15న శ్రీన‌గ‌ర్ లాల్ చౌక్‌ లో జెండా ఎగురువేసి త‌న దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాల‌ని భావించింది. ఇందులో భాగంగా శ్రీన‌గ‌ర్ ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్న ఆమెను అధికారులు అడ్డుకున్నారు. ఆమెనుకానీ లాల్ చౌక్‌ కు అనుమ‌తిస్తే వేర్పాటువాదుల కార‌ణంగా ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉందంటూ ఆమెను నిలువ‌రించారు. స్వ‌తంత్ర్య దేశంలో ఒక ప్రాంతంలో జాతీయ జెండా ఎగుర‌వేయ‌లేని ప‌రిస్థితి ఉండ‌టానికి మించిన దుర‌దృష్టం ఇంకేం ఉంటుంది? ఈ ప‌రిస్థితి మారేదెప్పుడు..?
Tags:    

Similar News