జియో మరో కొత్త వ్యాపారం

Update: 2020-09-06 05:15 GMT
‘జియో’.. అంబానీలకు బాగా కలిసొచ్చిన పేరు. రిలయన్స్ సామ్రాజ్యంలో ‘జియో’ పేరుతో ముఖేష్ అంబానీ  మొదలుపెట్టిన టెలికాం వ్యాపారం భారతదేశంలో డిజిటల్ విప్లవం సృష్టించింది. దీంతో ఆ తర్వాత క్రమంలోనే ‘జియో మార్ట్’, జియో ఆన్ లైన్ బిజినెస్ లలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో రంగంలోకి రిలయన్స్ దిగబోతోంది.

త్వరలోనే జియో యూనివర్సిటీని స్థాపించబోతున్నట్టు  జియో బోర్డు డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. పిల్లల ఆలోచన విధానాన్ని తీర్చిదిద్దే గొప్ప అవకాశం స్కూళ్ల ద్వారా వస్తుందని తెలిపింది.

అందుకే ప్రపంచ స్థాయి యూనివర్సిటీలకు ధీటుగా జియో యూనివర్సిటీని నిర్మిస్తున్నామని అంబానీ కూతురు తెలిపింది. ఇక్కడ అన్ని రంగాలకు సంబంధించిన విద్య అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఇప్పటికే రిలయన్స్ కు ధీరూభాయ్ స్కూల్స్, రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ ను నడుపుతున్నారు.
Tags:    

Similar News