హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తనదైన శైలిలో కొత్త సమీకరణాల వైపు తిప్పేసిన జన నాయక జనతా పార్టీ (జేజేపీ) అధినేత, రాజకీయాల్లోకి యంగ్ తరంగ్ గా దూసుకువచ్చిన దుష్యంత్ చౌతాలా... తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. హర్యానాలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా... తన మద్దతు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించేసిన దుష్యంత్... దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఓ హాట్ టాపిక్ గా మారిపోయారు. తనపై కొనసాగుతున్న ఆసక్తికర చర్చలకు మరింత సరుకును ఇచ్చేసిన దుష్యంత్... మిత్రపక్షం బీజేపీ తనకు ఇవ్వజూపిన ఉప ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకున్న ఆయన... సదరు పదవిని తన తల్లి నైనా చౌతాలాకు ఇప్పించే దిశగా పావులు కదుపుతున్నారు.
ఈ విషయాన్ని దుష్యంత్ స్వయంగా ప్రకటించకున్నా... ఆయన పార్టీ జేజేపీకి చెందిన కీలక నేతలు ఇదే విషయాన్ని దాదాపుగా ధృవీకరించేస్తున్నారు. ఈ నేపథ్యంలో నైనాకు సంబంధించిన వివరాలపై ఆసక్తి నెలకొంది. దుష్యంత్ తల్లిగానే ఇప్పుడు మనమంతా చెప్పుకుంటున్న నైనా బ్యాక్ గ్రౌండ్ ఏమంత చిన్నదేమీ కాదు. నైనా చౌతాలా తాజా ఎన్నికల్లో బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ నేత రణ్‌బీర్ సింగ్ మహేంద్రను ఓడించారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అజయ్ చౌతాలా భార్య అయిన నైనా చౌతాలా... గతంలో దబ్వాలి నుంచి ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆ తర్వాత 2018లో కుమారుడు దుష్యంత్ స్థాపించిన జన నాయక జనతా పార్టీలో చేరారు.
ఇదిలా ఉంటే... హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోసారి పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేఎల్పీ సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఖట్టర్ ఎన్నికైన కాసేపటికే జేజేపీ కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో అసెంబ్లీలో తమ పార్టీ నేత ఎవరన్న విషయాన్ని మాత్రం జేజేపీ ఇంకా నిర్ధారించలేదు. ఈ క్రమంలోనే బీజేపీ తనకు ఆఫర్ చేసిన డిప్యూటీ సీఎం పదవిని తాను కాకుండా తన తల్లి నైనాకు కట్టబెట్టేందుకు దుష్యంత్ నెరపుతున్న రాజకీయం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయన్నారు. ఆ లోగా దుష్యంత్ కూడా డిప్యూటీ సీఎంగా తన తల్లి పేరును ప్రకటిస్తారన్న కోణంలో వార్తలు వినిపిస్తున్నాయి.