కేసీఆర్‌ తో మాజీ సీఎం స‌కుటుంబ భేటీ..

Update: 2018-03-28 17:08 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఫ్రంట్ వేగం పెంచుతున్నారు. ఇప్ప‌టికే ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీతో భేటీ అయిన కేసీఆర్‌...దీనికి కొన‌సాగింపుగా మ‌రో స‌మావేశం నిర్వ‌హించారు. అయితే ఈ ద‌ఫా త‌ను అక్క‌డ ప‌ర్య‌టించ‌కుండా ఆ మాజీ సీఎంను స‌కుటుంబంతో త‌న ఇంటికి ఆహ్వానించారు. స‌వివ‌రంగా చ‌ర్చించారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను ఇవాళ కలిశారు.

ప్రగతిభవన్‌ లో జార్ఖండ్ మాజీ సీఎం - హేమంత్ సోరెన్‌ తో కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోరెన్ జాతీయ రాజకీయాలు - థర్డ్ ఫ్రంట్ తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. కేసీఆర్.. థర్డ్ ఫ్రంట్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే హేమంత్ సోరెన్ థర్డ్ ఫ్రంట్‌ కు తన మద్దతు ప్రకటించిన విషయం విదితమే. ఈ సంద‌ర్భంగా త‌న ఆలోచ‌న‌ను కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ట్లు స‌మాచారం. రెండు జాతీయపార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయ‌ని అందుకే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆలోచ‌న‌ను ఎత్తుకుంటున్నామ‌ని వివ‌రించారు. గత 70 ఏండ్లుగా దేశాన్ని పాలించిన రెండు జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని కేసీఆర్ పున‌రుద్ఘాటించారు.

దేశంలో తీవ్ర అసంతృప్తి ఉందని కేసీఆర్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. `మహారాష్ట్రలో వేలమంది రైతులు పాదయాత్రగా వచ్చారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎందుకు వస్తున్నాయి? దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఉన్నది నలభైకోట్ల ఎకరాలు. ప్రతి పొలానికి - ప్రతి పొలానికి నీరిచ్చినా కూడా ఇంకా 30వేల టీఎంసీల నీళ్లు అదనంగా ఉన్నాయి. అయినా 70 ఏండ్ల పరిపాలనలో కూడా సాగునీళ్లు రావు.. తాగునీళ్లు రావు. అందుకే ఈ దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉంది. జీడీపీలో మనకంటే తక్కువ ఉన్న చైనా మన కండ్ల ముందే అభివృద్ధి చెందింది - జపాన్ - సింగపూర్ - సౌత్ కొరియా మనకంటే బాగుపడ్డాయి. 70 ఏండ్ల రెండు జాతీయ పార్టీల పాలనలో ప్రజల్లో నిరాశ ఉంది` అని కేసీఆర్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News