భారతీయులకు విషెస్: జోబిడెన్, కమలా హ్యారిస్

Update: 2020-12-01 08:58 GMT
అమెరికా కొత్త అధ్యక్షుడు జోబిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మరోసారి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో పెద్దసంఖ్యలో ఉన్న సిక్కులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కు మత గురువు గురునానక్ దేవ్ 551వ జయంతిని పురస్కరించుకొని ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ బోధనలను విశ్వమానవాళికి సామాజిక బాధ్యతను, నైతికతను నేర్పాయని తెలిపారు. మతానికి అతీతంగా ఆయన జీవితం అమెరికన్లకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.గురునానక్ బోధనలను విశ్వ మానవాళికి సామాజిక బాధ్యతను, నైతికతను నేర్పాయని చెప్పారు.

మతాలకు అతీతంగా ఏకత్వాన్ని సమానత్వాన్ని చాటి చెప్పాయని జోబిడెన్, కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అనేక సవాళ్లతో కూడిన ఈ సంవత్సరంలో అమెరికాలో నివసించే ప్రతి సిక్కు మతస్తుడూ ప్రదర్శించిన సంయమనం అతి గొప్పదని.. దానికి కారణంగా గురునానక్ బాటలో ప్రయాణించడమేనని అన్నారు.

ఆకలిని తీర్చడానికి గురునానక్ శతాబ్దాల కిందటే లంగర్ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దాన్ని ఇప్పటికీ కొనసాగించడం సిక్కుల గొప్పదనానికి నిదర్శనమని చెప్పారు. గురునానక్ చూపించిన ఐక్యత, సామరస్యం, సేవామార్గాలను అన్ని దేశాలను అనుసరించాల్సిన అవసరం ఉందని, కఠోర శ్రమ, నిజాయితీ, ఆత్మాభిమానంతో కూడిన జీవిన విధానాన్ని ఆయన ప్రబోధించారని పేర్కొన్నారు.

సిక్కులు మాత్రం గురునానక్ బోధనలను స్ఫూర్తిగా తీసుకుని శాంతియుతంగా ర్యాలీలను చేపట్టారని జోబిడెన్, కమలాహారిస్ గుర్తు చేశారు. మతానికి అతీతంగా వ్యవహరించడం, అందరినీ సమాన దృష్టితో చూడటం గురునానక్ బోధనల నుంచే వారు అలవరుకున్నారని జో బిడెన్, కమలా హ్యారిస్ పేర్కొన్నారు.
Tags:    

Similar News