అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ బైడెన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి క్లింటన్, జార్జ్‌బుష్, ఒబామా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలు) లేడీ గాగా జాతీయ గీతాలాపానతో కార్యక్రమం మొదలయ్యింది. ఆ తర్వాత బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ప్రసంగించారు.
మరోవైపు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ కూడా ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా కమల హారిస్ ప్రమాణం చేశారు. బైడెన్ అధ్యక్ష ప్రమాణస్వీకారోత్సవానికి తాను హాజరు కాబోనని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఇలా జరగడం రెండోసారి.