బైడెన్​ సంచలన నిర్ణయం.. రష్యా గజ గజ..!

Update: 2021-04-16 04:30 GMT
రష్యా.. అమెరికా మధ్య శతాబ్ధాలుగా ఆధిపత్య పోరు నడుస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తరచూ తమ ఎన్నికల నిర్వహణలో రష్యా జోక్యం చేసుకుంటున్నదని.. ఇక్కడి ఎన్నికల గెలుపోటములను రష్యా ప్రభావితం చేస్తున్నదని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో డొనాల్డ్​ ట్రంప్​ గెలుపునకు రష్యా పరోక్షంగా సహకరించిందన్న వార్తలు కూడా వచ్చాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏడుగురు రష్యా దౌత్యవేత్తలపై నిషేధం విధిస్తూ వైట్​హౌస్​ నిర్ణయం తీసుకున్నది.

గత ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హ్యాకింగ్​కు పాల్పడిందని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైట్​ హౌస్​ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నది. 2020 అధ్యక్ష ఎన్నికల్లోనూ రష్యా జోక్యం చేసుకున్నట్టు యూఎస్​ ఇంటెలిజెన్స్​ పసిగట్టింది. అప్పట్లో ఈ విషయంపై వార్తలు కూడా వచ్చాయి. ఇక రష్యా జోక్యంపై అమెరికా ఇంటెలిజెన్స్​ .. వైట్​హౌస్​ కు ప్రత్యేక నివేదిక సమర్పించినట్టు సమాచారం. రష్యా దౌత్యవేత్తలు అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టు ఆధారాలతో సహా నిరూపించినట్టు సమాచారం. దీంతో బైడెన్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకున్నది.

అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్న 32 మంది రష్యా దౌత్య వేత్తలపై ప్రస్తుతం బహిష్కరణ వేటు వేశారు. రష్యాపై హ్యాకింగ్​ ఆరోపణలు చాలా రోజులుగా ఉన్నాయి. కొన్ని డేంజరస్​ సాఫ్ట్​వేర్లను ఉపయోగించి.. రష్యాలోని కొందరు హ్యాకర్లు వివిధ దేశాల అంతర్గత సమాచారాన్ని.. సైనిక రహస్యాలను తెలుసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఫేస్​బుక్​ ఇతర సోషల్​ మీడియా సంస్థలను హ్యాక్​ చేసి.. ప్రజల వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో రష్యాపై కొన్ని ఆర్థిక ఆంక్షలు కూడా విధించాలని అమెరికా నిర్ణయం తీసుకున్నది.  డొనాల్డ్​ ట్రంప్​ రెండోసారి గెలుపొందేందుకు రష్యా హ్యాకర్లు తీవ్రంగా ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే వీటికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయా? లేవా? అన్న విషయంపై వైట్​ హౌస్​ క్లారిటీ లేదు. కొందరు అనుమానాస్పద వ్యక్తులపై మాత్రం రష్యా చర్యలు తీసుకున్నది. అమెరికా రష్యా నడుమ ప్రస్తుతం విబేధాలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విబేధాలు ఇలాగే కొనసాగుతాయా? లేక మళ్లీ దౌత్యం ఫలించి ఇరు దేశాలు ఒక్కటవుతాయా? అన్నది వేచి చూడాలి.
Tags:    

Similar News