ఏపీలో రాజధాని మార్పు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (శుక్రవారం) జరగనున్న మంత్రివర్గ సమావేశంతో రాజధాని మార్పు అంశంపై పూర్తి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలతో విశాఖకు రాజధాని మార్పు పక్కా అన్న స్పష్టత వచ్చినట్లేనని చెప్పక తప్పదు.
రాజధాని మార్పు ఖాయం కావటంతో.. దాని పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఒక ప్రశ్న అయితే..దీని కారణంగా ఎవరెవరు? ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతారన్నది మరో అంశంగా మారింది. రాజకీయ నేతలు.. అధికారుల సంగతి ఎలా ఉన్నా.. విశాఖకు రాజధాని మారిస్తే మాత్రం అడ్డంగా బుక్ అయ్యేది మీడియా ప్రతినిధులేనని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు మీడియా సంస్థలన్ని తమ ఉద్యోగుల్ని రెండుగా చేసేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఒక్క హెడ్ కాస్తా.. ఇద్దరిని ఎంపిక చేయటం ఒక ఎత్తు అయితే.. హైదరాబాద్ లో ఉండే స్టేట్ బ్యూరోలను (మీడియా సంస్థలో ఉండే రిపోర్టర్ల వింగ్ లో కీలకమైనవారు) రెండుగా చేసి.. ఒకటి హైదరాబాద్ లో ఉంచేసి.. రెండో దాన్ని విజయవాడకు పంపారు. ఎంతోకాలంగా హైదరాబాద్ లో ఉంటున్న ఈ సీనియర్ జర్నలిస్టులకు విజయవాడకు వెళ్లటం ఒక పెద్ద శిక్షలా మారింది.
ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఇల్లు.. పిల్లల చదువులు.. వైఫ్ ఉద్యోగం లాంటివన్ని సెట్ అయిన వేళ.. ఈ సెటప్ ను మార్చేయటం వారికి ఇబ్బందిగా మారింది. తప్పదు కదా అని వెళ్లిన వారికి ఇప్పుడు రాజధాని మార్పుతో మరో సమస్య తెర మీదకు వచ్చింది.విజయవాడకు వెళ్లిన తర్వాత చాలామంది స్టేట్ రిపోర్టర్లను రాజధానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో తమ బడ్జెట్ కు తగ్గట్లు ఇళ్లు కొనుక్కున్నారు. ఇప్పుడు అలాంటి వారి పరిస్థితి ఇబ్బందిగా మారితే.. పిల్లల చదువులు సెట్ చేసుకుంటున్న వారికి తాజా మార్పుతో మరో సమస్య ఎదురుకానుంది.
ఇంతకాలం బెజవాడలో ఉన్న స్టేట్ బ్యూరోల్ని విశాఖకు తరలిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. విశాఖలో తమకు అనువుగా ఉండే ఇళ్లు.. వాటి అద్దెలతో పాటు.. స్కూల్ చదువులు పెద్ద సమస్యగా మారనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి కొద్దిమంది హైదరాబాద్ లో ఫ్యామిలీలను ఉంచేసి.. విజయవాడ - హైదరాబాద్ వారాంతంలో షటిల్ సర్వీసులు చేస్తున్నారు. ఇలాంటి వారికి రాజధాని విశాఖకు మారితే.. ఆఫీసులు మొత్తం అక్కడకు మారనున్నాయి. అదే జరిగితే.. ఇబ్బందులు తప్పవంటున్నారు. రాజధాని మార్పు ఏమో కానీ.. మీడియా ప్రతినిధులకు మాత్రం చుక్కలు తప్పవన్న మాట వినిపిస్తోంది.