జూనియర్ కి అన్ని భాషలు వచ్చా....అందుకేనా...?

Update: 2022-09-05 00:30 GMT
జూనియర్ ఎన్టీయార్ అని అంటున్నారు కానీ ఆయన అన్ని విధాలుగా సీనియరే. అవును. నటనలో ఎపుడో తనకంటూ ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇక డైలాగ్ డెలివరీ కానీ డ్యాన్స్ కానీ జూనియర్ స్పెషల్ అనే చెప్పాలి. సినిమా హీరోగా కాకుండా యాంకర్ గా కూడా జూనియర్ ది బెస్ట్ అనిపించుకున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కానీ బిగ్ బాస్ బాస్ షో కానీ జూనియర్ అంటే ఏమిటి అన్నది చెబుతాయి.

ఇక మైక్ పట్టుకుని జూనియర్ మాట్లాడితే తప్పు ఎక్కడా దొర్లదు, స్పీచ్ కూడా వినసొంపుగా ఉంటుంది. వీటికంటే ముందు ఆయన టీడీపీ తరఫున చేసిన ఎన్నికల ప్రచారం కూడా ఒక రేంజిలో సాగింది. ఆయన హావభాభాలు తాత ఎన్టీయార్ ని పోలి ఉంటాయి. ఇక జనాలతో డైరెక్ట్ గా కనెక్ట్ కావడం ఎలాగో జూనియర్ కే తెలుసు అని కూడా అంటారు.

జూనియర్ చాలా చిన్న వయసులోనే సినిమా ఫీల్డ్ లోకి వచ్చాడు. కేవలం పద్దెనిమిదేళ్ళకే ఆది లాంటి మాస్ మూవీతో స్టార్ అయిపోయాడు. రెండు పదులు కూడా నిండని వయసులో సింహాద్రి లాంటి  బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. ఇవన్నీ జూనియర్ లోని టాలెంట్ గానే చూడాలి. వీటి కంటే ముందు ఆయన మంచి ట్రెడిషనల్ డ్యాన్సర్ కూడా.

ఇక ఇంటర్ దాకా మాత్రమే జూనియర్ చదివి ఇండస్ట్రీకి వచ్చేశారని అంటారు. అలాంటి జూనియర్ ఇంగ్లీష్ చాలా  బాగా ఉంటుంది. ఇక తెలుగు కూడా మంచి పదాలతో సాగుతోంది. ఈ రెండు భాషలే కాదు ఏకంగా ఎనిమిది తొమ్మిది  భాషలు జూనియర్ కి వచ్చుట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని. ఈయన జూనియర్ కి అత్యంత సన్నిహితుడు అన్నది తెలిసిందే.

జూనియర్ ఎన్టీయార్ కి  తెలుగు ఇంగ్లీష్ తో పాటుగా మన పక్క భాషలు అయిన తమిళం, కన్నడం, మళయాళం, ఉర్దూ,. స్పానిష్, హిందీ భాషలు వచ్చుట. ఈ భాషల్లో జూనియర్ అనర్గళంగా మాట్లాడుతారుట. అంతేనా ఆయనకు ఆరు నెలల సమయం ఇస్తే చాలు మరో ఆరు భాషలను అవలీలగా నేర్చేసుకుని మాట్లాడేస్తారు అని కొడాలి చెప్పుకొచ్చారు.

జూనియర్ పుస్తకం చూడకుండా ఏ రిఫఫెన్స్ లేకుండా ఏకధాటిగా మాట్లాడగలడని, అది కూడా జనరంజకంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. అందుకే ఆయన్ని బీజేపీ కోరి మరీ సెలెక్ట్ చేసుకుందేమో అన్న డౌట్ ని వ్యక్తం చేశారు. పాన్ ఇండియా స్టార్ గా ఉన్న జూనియర్ దేశమంతా తిరిగి బీజేపీ తరఫున ప్రచారం చేయగల సమర్ధుడు అని వారు గుర్తించే ఆయనతో భేటీ వేశారు అని అంటున్నారు. ఈ రోజుకు చూస్తే అన్ని భాషల మీద పట్టున్న వారు ఎవరూ లేరని జూనియర్ ఎన్టీయార్ ఆ విషయాల్లో గ్రేట్ అని కూడా కొడాలి నాని మెచ్చేసుకున్నారు.
Tags:    

Similar News