ఆ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సు... స్కూళ్లో కలిసి చదువుకున్న వారిద్దరూ ఆ తరువాత ఎవరి దారినవారు సాగిపోయారు. ఆ స్నేహితుల్లోని అమ్మాయి మిండీ గ్లేజర్ బాగా చదువుకుని న్యాయాన్ని కాపాడే జడ్జి అయింది... అబ్బాయి అధర్ బూత్ మాత్రం అందుకు భిన్నంగా పెద్ద దొంగగా మారాడు. స్కూలు ఎడ్యుకేషన్ పూర్తయిన తరువాత వారిద్దరూ మళ్లీ కలుసుకోలేదు... కానీ, పది నెలల కిందట ఆ ఇద్దరూ కలుసుకున్నారు. అది కూడా విచిత్ర పరిస్థితుల్లో. న్యాయమూర్తి అయిన మిండీ గ్లేజర్ పనిచేస్తున్న కోర్టు బోనులో అధరర్ బూత్ నిల్చున్నాడు. అధర్ ను చూడగానే గ్లేజర్ గుర్తుపట్టింది. ఆప్యాయంగా పలకరించింది. అదేసమయంలో అధర్ ఎంతో సిగ్గుపడిపోయాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ఎంతో ఉన్నతంగా న్యాయమూర్తి అవ్వగా ఆమె ఎదుట తాను తలవంచుకుని నిల్చోవాల్సి రావడంపై సిగ్గుపడ్డాడు. అమెరికాలోని మియామీలో జరిగిన ఘటనలో ఆ రోజున గ్లేజర్ తన స్నేహితుడికి ఆ నేరాన్ని బట్టి శిక్ష వేశారు. పది నెలల జైలు శిక్ష విధించారు.
జైలు శిక్ష అనుభవించిన కాలంలో అధర్ ఎంతో మారిపోయాడు. రెండు రోజుల కిందట శిక్ష పూర్తిచేసుకుని విడుదలయ్యాడు అధర్. ఆయన జైలు నంచి విడుదల అవుతాడని ముందే తెలిసిన గ్లేజర్ ఆ సమయానికి అక్కడికి వెళ్లారు. స్నేహితుడిని ఆప్యాయంగా కౌగలించుకున్నారు. శిక్ష వేసిన చేతులే ఆప్యాయంగా తనను ఆలింగనం చేసుకోవడంతో అధర్ కరిగిపోయాడు. మళ్లీ జీవితంలో తప్పులు చేయబోనని గ్లేజర్ కు మాటిచ్చాడు. సన్మార్గంలో సాగుతానని గ్లేజర్ కు హామీ ఇచ్చాడు.