అధికార పార్టీ అనే భరోసా, మూడేళ్ల కాలంలో పనులు చేసుకోవచ్చుననే ధైర్యంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు. వైసీపీ గెలిచి పార్టీ ఫిరాయించిన టీడీపీ చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి అనుకొన్నది ఒకటైతే అయినది ఇంకోటనే రీతిలో ఉందంటున్నారు. వైసీపీ అధినేత తీరు నచ్చక నాడు ఎమ్మెల్యేలు కొందరు ఆ పార్టీని వీడినట్లు ప్రచారం సాగినా అధికార టీడీపీ బేరసారాలు కూడా కొంత కారణమన్నది రాజకీయ విశ్లేషకుల భావన. అయితే ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి ఇన్నాళ్లవుతున్న వారికి ఒరిగిన ప్రయోజనం ఏమిటీ అన్నది ప్రస్తుతం వారి సన్నిహితులలోనే జోరుగా చర్చసాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఈ జంప్ జిలానీలు కొంత గౌరవం పొందుతున్నా వాస్తవానికి ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదని చర్చకూడా మరోవైపు కొనసాగుతోంది. కొందరు మంత్రి పదవులు ఆశించికూడా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లారన్న వాదనలు కూడా ఉన్నాయి. కానీ ఈ జంప్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిన నాటి నుంచి మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఎప్పుడు జరుగుతుంది అన్న దానిపై స్పష్టత లేకపోవడం ఒకెత్తు అయితే...ఒకవేళ జరిగిన అందులో తమ బెర్త్ ఖాయమన్న ధీమా వ్యక్తంచేయడంలేదు. వాస్తవ పరిస్థితి ఇలావుంటే టీడీపీలోకి వెళ్లి తాము లాభపడ్డామా లేక మున్ముందు క్లిష్టపరిస్థితులను కొని తెచ్చుకొంటు న్నామా అన్నది వారిలో వారే చర్చించుకొంటున్నట్లు తెలిసింది.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన కొందరు ఎమ్మెల్యేలు తమ భవిష్యత్‌పై బెంగ మొద లవుతున్నట్లు సమాచారం. ఈ ఎమ్మెల్యేల రాకతో టీడీపీలో ఇప్పటికే కొనసాగుతున్న స్థానిక నేతలకు వీరికి మధ్య గ్రూపు ఆధిపత్యం కొనసాగుతోంది. వైసీపీ నుంచి వెళ్లిన 20 మంది ఎమ్మెల్యేలలో ఒకటి రెండు చోట్ల మినహా ఈ ఎమ్మెల్యేలు ప్రతిచోట గ్రూపు ఆధిపత్యం కొనసాగు తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ మారిన తమకు టీడీపీ నుంచి టిక్కెట్టు దొరుకుతుందా..? ఒకవేళ టిక్కెట్టు తెచ్చుకొన్న పార్టీలో తమను వ్యతిరేకిస్తున్న వర్గం గెలుపునకు సహకరిస్తుందా అన్న ఆందోళన ఆ ఎమ్మెల్యే లలో కనిపిస్తున్నట్లు సమాచారం. తన పార్టీని వీడిన ఎమ్మె ల్యేల స్థానాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చే ఎన్నికల నాటికి కొత్త అభ్యర్థులు అక్కడ ఎదిగేలా చర్యలు తీసుకొంటోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ జంప్ జిలానీలు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తాము చేరిన పార్టీ అయిన టీడీపీలో తమను వ్యతిరేకిస్తున్న అభ్యర్థులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పైకి కనిపించని త్రిముఖ పోటీతో తమ పరిస్థితి ఏమిటీ అన్నది ఈ జంప్ జిలానీలను ఈ ఎన్నికల అంశం కలవరపర్చుతున్నట్లు సమాచారం. ఒకప్పుడు ఒక పార్టీతో తలపడాల్సి వస్తే మున్ముందు సొంత పార్టీలో పెరిగిన గ్రూపులతో పాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులతో తలపడాల్సి వస్తుందేమోనని ఈ ఎమ్మెల్యేలు ఆందోళనతో ఉన్నట్లు సమాచారం.
తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేదని కేంద్రం స్పష్టంచేసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలలో మరింత కలవరం మొదలైంది. నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు లేనందున వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమకు టిక్కెట్లు కేటాయిస్తారా లేదా అన్న ఆందోళన కూడా ఈ ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే తమ నియోజకవర్గాలలో మరింత శ్రమించి పనిచేస్తే తమకే సీటు గ్యారంటీ అని కొందరు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. చంద్రబాబును నమ్ముకొని వచ్చాం కాబట్టి వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే తమను ఆదుకొంటారని వలస వచ్చిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు.