జూనియర్ డాక్టర్ల సమ్మె.. ముఖ్యమంత్రి ఆగ్ర‌హం

Update: 2021-05-26 13:30 GMT
ప్ర‌భుత్వం త‌మ డిమాండ్లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ.. నేటినుంచి (మే 26) జూనియ‌ర్ డాక్ట‌ర్లు, సీనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్స్ వేర్వేరుగా స‌మ్మెకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం స‌మ్మె నోటీసు ఇచ్చిన వైద్యులు.. త‌మ న్యాయ‌మైన కోరిక‌లు తీర్చ‌క‌పోతే విధులు బ‌హిష్క‌రిస్తామ‌ని అన్నారు.

కాగా.. ఈ విష‌యమై స్పందించిన‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. వైద్యుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌పై దాడిని కొన‌సాగిస్తున్న వేళ స‌మ్మెకు పిలుపునివ్వ‌డం ఏ మాత్రం స‌రికాద‌ని అన్నారు. ఇలాంటి విప‌త్కర ప‌రిస్థితుల్లో ప్ర‌జారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

జూనియ‌ర్ వైద్యుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని, త‌క్ష‌ణ‌మే విధుల‌కు హాజ‌రు కావాల‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. ఇక‌, సీనియ‌ర్ రెసిడెంట్ల గౌర‌వ వేత‌నం 15 శాతం పెంచాల‌ని సీఎం నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా సేవ‌ల్లో ఉన్న మెడిక‌ల్ స్టూడెంట్ల‌కు సైతం సీనియ‌ర్ రెసిడెంట్ల‌కు వ‌చ్చే గౌర‌వ వేత‌మ‌నే అందించాల‌ని నిర్ణ‌యించారు. అన్ని రాష్ట్రాల్లో ఇచ్చే ఉప‌కార వేత‌నం క‌న్నా.. తెలంగాణ జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు ఎక్కువ‌గా ఇస్తామ‌ని సీఎం అన్నారు.

మ‌రి, ముఖ్య‌మంత్రి నిర్ణ‌యంపై జూనియ‌ర్ డాక్ట‌ర్లు, సీనియ‌ర్‌ రెసిడెంట్ వైద్యులు ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అన్న‌ది చూడాలి. స‌మ్మె కొన‌సాగిస్తారా? విరమిస్తారా? అన్న‌ది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News