రాజకీయ అధినేతలు సైతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా విమర్శించలేకపోతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న రోజుల్లో.. ఒక రిటైర్డ్ జస్టిస్ నోట ఘాటు వ్యాఖ్యలు రావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో పాటు.. ఆయన పాలనా విధానాల్ని తీవ్ర స్థాయిలో తప్పు పట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విపక్షాలు చేసే పని.. ఒక రిటైర్డ్ జస్టిస్ చేయటమా అన్న ప్రశ్న పలువురి నోట వినపడుతున్నా.. ఆయన మాత్రం అలాంటివేమీ పట్టించుకోవటం లేదు. ఇంతకీ ఆ రిటైర్డ్ జస్టిస్ అంటారా? అక్కడికే వస్తున్నాం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.
వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించుకుందాం.. తెలంగాణను రక్షించుకుందాం అంట జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ తెలంగాణ అని.. ఇక్కడి ప్రజలు తలుచుకుంటే కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తీసుకొస్తారు.. ఖబడ్డార్ అంటూ హెచ్చరించటం విశేషం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన రైతులకు రుణమాఫీ.. దళితులకు ముఖ్యమంత్రి పదవి.. దళిత.. గిరిజనులకు మూడేసి ఎకరాల చొప్పున భూమి ఇవ్వటం లాంటి హామీల్ని ఉల్లంఘించారని గుర్తు చేశారు.
అబద్ధాల్ని ప్రచారం చేసుకునే కేసీఆర్.. గ్లోబల్స్ ను మించిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని కేసీఆర్ ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించిన ఆయన.. ఇరిగేషన్ ఇంజనీర్లు వద్దని చెబుతున్నా వినకుండా.. రూ.34వేల కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.80వేలకు పెంచి కడుతున్నారన్నారు. విపక్షాల నోట రావాల్సిన మాటలన్నీ ఈ మాజీ జస్టిస్ నోట రావటం ఆసక్తికరమైన అంశమనే చెప్పాలి. ఉన్నట్లుండి చంద్రకుమార్ ఎందుకింత ఘాటు విమర్శలకు దిగుతున్నారంటారు?