నేరం నిరూపణ అయి.. శిక్ష తేలిన తర్వాత కూడా దాన్ని అమలు చేసేందుకు న్యాయపరమైన అవరోధాలు ఎన్ని ఉంటాయన్న విషయం నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు సందర్భంగా దేశ ప్రజలకు బాగానే అర్థమైంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీలో అత్యంత దారుణ నేరానికి పాల్పడిన నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక పిటిషన్.. చట్ట ప్రకారంగా ఉన్న అవకాశాల్ని వినియోగించుకుంటూ రెండున్నర నెలలుగా శిక్ష అమలు కాకుండా తప్పించుకుంటున్నారు.
చివరకు శిక్ష అమలుకు కొన్ని గంటల ముందు కూడా దోషుల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు తలుపు తట్టటం.. ఉరి అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉరి అమలుకు స్టే ఇవ్వాలని కోరగా.. సుప్రీం ధర్మాసనం స్పందించి.. సరైన కారణం లేనిదే.. ఉరిశిక్ష అమలును ఆపలేమని.. అనవసరంగా సమయాన్ని వృధా చేయొద్దని నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ కు త్రిసభ్య ధర్మాసనం సూచన చేసింది.
దీంతో.. ముందుగా జారీ అయిన డెత్ వారెంట్లకు తగ్గట్లే నిర్భయ దోషులకు ఈ తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరిశిక్షను అమలు చేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం త్వర్వాత కానీ నిర్భయకు న్యాయం జరిగిందని బాధితురాలి తల్లి ఆశాదేవి పేర్కొన్నారు. నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేశారన్న జైలు అధికారుల ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తె నిర్భయకు న్యాయం జరిగిందని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు.