వీఆర్వో లకి సీఎం కేసీఆర్ హామీ !

Update: 2020-10-30 01:30 GMT
తెలంగాణ ప్రభుత్వం భూపరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 1985లో యన్టీఆర్ చేపట్టిన సంస్కరణల తరువాత ఇవే అతి పెద్ద సంస్కరణలు. ఈ రెవెన్యూ విధానంలో భాగంగా భూమి హక్కులు-పట్టాదారు పాస్ పుస్తకాల చట్టంతో పాటు వీఆర్వో పోస్టుల రద్దు చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ బిల్లుకి ఇప్పటికే  అసెంబ్లీ, మండలిలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.ఆ బిల్లును గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్లు కూడా గత నెలలోనే జారీఅయ్యాయి.  వీఆర్ ఓ పోస్టుల రద్దు, టీఎస్ బీపాస్ చట్టాలు, పురపాలక, పంచాయతీరాజ్, ప్రైవేట్ వర్సిటీ, జీఎస్టీ సవరణ చట్టాలు అమల్లోకి వచ్చాయి.

అయితే ,కొత్త రెవెన్యూ చట్టంలో వీఆర్వో లని రద్దు చేయడం తో వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఈ విషయం పై మీడియా లో పలు రకాల వార్తలు కూడా వచ్చాయి. తాజాగా దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. అతి త్వరలోనే విఆర్ ఓ ల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని అన్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలలో విఆర్వోలని సర్దుబాటు చేస్తామని స్పష్టం చేసారు. వీఆర్వో లపై కొన్ని మీడియా సంస్థలు , కొందరు రాజకీయ ప్రముఖులు సానుభూతి చూపిస్తున్నారని ,వారిని బజార్లో పడేస్తామని ఎక్కడా చెప్పలేదని ,ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి , సరైన నిర్ణయం తీసుకుంటామని  రాష్ట్రంలో ఏ ఒక్క వీఆర్వో కూడా బాధపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఇకపోతే , భూముల కుంభకోణం, అవినీతిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ ఆవిష్కృతమైంది. మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ పోర్టల్ ప్రారంభించారు. నవంబర్‌ 2 నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ధరణి పోర్టల్‌లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల రికార్డులు ఉన్నాయన్నారు. తెలంగాణ పోరాట యోధుడు వీరారెడ్డి పుట్టిన గ్రామం కాబట్టే ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి మూడుచింతలపల్లిని ఎంపిక చేశామన్నారు.
Tags:    

Similar News